calender_icon.png 4 February, 2026 | 1:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Business/Health

article_11812797.webp
పీఎం ఈ-డ్రైవ్ ఎలక్ట్రిక్ ట్రక్కు డెలివరీ

02-02-2026

మురుగప్ప గ్రూప్‌లో భాగమైన మాంట్రా ఎలక్ట్రిక్ భారత ప్రభుత్వ 'పిఎం ఈ-డ్రైవ్ పథకంకింద సర్టిఫికేషన్ పొందిన దేశంలోని మొట్టమొదటి హెవీ-డ్యూటీ ఎలక్ట్రిక్ ట్రక్ తయారీదారుగా నిలిచింది. తద్వారా భారతదేశ క్లీన్ మొబిలిటీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఈ విజయానికి గుర్తుగా, కంపెనీ దేశంలోని మొట్టమొదటి పిఎం ఈ-డ్రైవ్ సర్టిఫైడ్ ఎలక్ట్రిక్ హెవీ ట్రక్ అయిన 'రైనో 5538 ఈవీ 6x4 ట్రాక్టర్ ట్రైలర్'ను, భారతదేశపు అతిపెద్ద సిమెంట్ మరియు రెడీ-మిక్స్ కాంక్రీట్ కంపెనీ అయిన అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్‌కు డెలివరీ చేసింది. మొదటి పిఎం ఈ-డ్రైవ్ సర్టిఫైడ్ 'రైనో 5538 ఈవీ'ని అరుణ్ మురుగప్పన్ జెండా ఊపి ప్రారంభించి, అల్ట్రాటెక్‌కు అందజేశారు. తద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధిని ముందుకు తీసుకెళ్ళడంలో తన నిబద్ధతను బలోపేతం చేసుకుంది.

article_76118479.webp
కుప్పంలో చరిత్ర సృష్టించిన ఈ-మోటొరాడ్

02-02-2026

కుప్పం: ప్రముఖ ఈవీ సంస్థ 'ఈ-మోటొరాడ్' చిత్తూరు జిల్లా కలెక్టరేట్, కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ మరియు ఐఐటి కాన్పూర్ సంయుక్తంగా ఒక అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించాయి. ఇంతకు ముందెన్నడూ జరగని విధంగా, 24 గంటల వ్యవధిలో అత్యధిక సంఖ్యలో ఎలక్ట్రిక్ సైకిళ్లను పంపిణీ చేసి, 'గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాయి. కుప్పం ఒక ఆదర్శ నియోజకవర్గంగా, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు మరియు ఈ-మొబిలిటీలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటిగా నిలుస్తోంది. అయితే, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెరుగుతుండటం, సరైన సర్వీస్ లేకపోవడం వంటి కారణాల వల్ల గ్రామీణ భారతదేశం ఇంకా వెనుకబడిపోతోంది.

article_23808102.webp
బడ్జెట్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లు భారీగా పతనం

02-02-2026

ముంబై, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్ 2026 ప్రకటన స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభా వం చూపింది. ఫ్యూచర్స్, ఆప్షన్స్ ట్రేడింగ్‌పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ) పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడ్డారు. ఫలితంగా, గత ఆరేళ్లలో బడ్జెట్ రోజున సూచీలు ఇంత భారీ గా పతనం కావడం ఇదే తొలిసారి. శనివారం జరిగిన ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో సెన్సె క్స్, నిఫ్టీలు దాదాపు 2 శాతం మేర నష్టపోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 80,723 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 495 పాయింట్లు కోల్పోయి 24,825 వద్ద ముగిసింది. అయితే, రోజు మధ్యలో అమ్మకాల ఒత్తిడి తార స్థాయికి చేరడంతో సెన్సెక్స్ ఏకం గా 3,000 పాయింట్ల వరకు పతనమై 79, 899.42 వద్ద ఇంట్రా-డే కనిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ కూడా 24,572 స్థాయికి పడిపోయింది.