calender_icon.png 4 February, 2026 | 10:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_79766332.webp
కోఠి ఎస్‌బీఐ ఏటీఎం వద్ద కాల్పుల కలకలం

31-01-2026

హైదరాబాద్: శనివారం ఉదయం కోఠి ప్రాంతంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank of India) ప్రధాన శాఖ సమీపంలో కాల్పుల ఘటన జరగడంతో బ్యాంక్ స్ట్రీట్‌లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఉదయం 7 గంటల ప్రాంతంలో రషీద్ అనే వ్యక్తి నగదు డిపాజిట్ చేయడానికి ఏటీఎం వద్దకు వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది. పోలీసుల ప్రకారం, దుండగులు రషీద్‌ను వెంబడించి కాల్పులు జరిపి, అతని వద్ద ఉన్న రూ.6 లక్షల నగదుతో పారిపోయారు. రషీద్ కాలికి బుల్లెట్ గాయం కావడంతో, అతడిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సుల్తాన్ బజార్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులను గుర్తించడానికి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

article_88150475.webp
కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యం హద్దుమీరుతుంది

30-01-2026

హైదరాబాద్: బీఆర్ఎస్ నాయకుల మీద కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యం హద్దులుమీరుతోందని కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వగ్రామం వీణవంకలో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరలో పాల్గొనకుండా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డిని పోలీసులు అకారణంగా నిర్బంధించడం, వారి కుటుంబసభ్యుల పట్ల దురుసుగా ప్రవర్తించడం రాష్ట్రంలో సాగుతున్న అరాచక, నిర్భంధ పాలనకు నిదర్శనమన్నారు. కౌశిక్ రెడ్డి మీద పోలీసుల దౌర్జన్యాన్ని కేటీఆర్ ఖండించారు. ప్రజా సమస్యల మీద నిత్యం పోరాడే నాయకులను మీ నిర్బంధాలతో, అక్రమ కేసులతో భయపెట్టలేరని కేటీఆర్ పేర్కొన్నారు.

article_13260111.webp
విరిగిపడ్డ జెండా కర్ర.. మంత్రి తప్పిన ప్రమాదం

26-01-2026

నారాయణపేట: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మక్తల్‌లోని తహసీల్దార్ కార్యాలయంలో జెండాస్తంభంలో కొంత భాగం కూలిపోవడంతో కాంగ్రెస్ నాయకుడు కె. నాగేందర్‌కు గాయాలయ్యాయి. అయితే పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి(Minister Vakiti Srihari) సురక్షితంగా బయటపడ్డారు. వేడుకల కోసం మంత్రి, అధికారులు, స్థానిక నివాసితులు తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. తహసీల్దార్ సతీష్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేస్తుండగా, జెండా స్తంభంలో కొంత భాగం విరిగి, అక్కడ గుమిగూడిన వారిపై పడిందని సమాచారం. దీని ఫలితంగా కాంగ్రెస్ నాయకుడు నాగేందర్ కాలికి గాయాలయ్యాయి. దీంతో అతడిని వెంటనే మక్తల్‌లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మంత్రి శ్రీహరికి ఎలాంటి గాయాలు కాలేదని, త్రుటిలో తప్పిన ప్రమాదం అధికారులు తెలిపారు.

article_18562868.webp
కవిత కొత్త పార్టీ.. రంగంలోకి ప్రశాంత్ కిషోర్

19-01-2026

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీ(Kavitha new party) ఏర్పాటులో స్పీడ్ పెంచినట్లు కొడుతోంది. కవిత పార్టీ ప్రారంభించే విషయమై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో చర్చలు జరుపుతున్నారని సోమవారం తెలంగాణ జాగృతి వర్గాలు తెలిపాయి. రెండు నెలల్లో పీకేతో కవిత రెండు సార్లు భేటీ అయ్యారు. సంక్రాంతి వేళ ఐదు రోజులు పాటు మాజీ ఎంపీ కిషోర్‌తో(Prashant Kishor) కవిత సమావేశం అయ్యారు. ప్రజల కోణంలో ఎలా పనిచేయాలనే అంశంపై పీకేతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ విధానాల రూపకల్పన కోసం ఇప్పటికే 50 కమిటీలతో అధ్యయనం చేశారు.

article_71831539.webp
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన వల్లే ప్రమాదాలు

17-01-2026

మహబూబాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): వాహనదారులు ట్రాఫిక్ నిబంధ నలను ఉల్లంఘించడం వల్లనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ప్రతి వాహనదారుడు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ రూల్స్ ను ఖచ్చితంగా పాటించాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ కోరారు.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అరైవ్ అలైవ్ కార్యక్ర మంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ప్రతి వ్యక్తి సురక్షితంగా తన గమ్యస్థానానికి చేరుకోవడమేనని పేర్కొంటూ, ఇం దుకోసం పోలీస్ ఉద్యోగులు ముందుగా రో డ్డు భద్రత నియమాలను పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ట్రా ఫిక్ రూల్స్ కచ్చితంగా పాటిస్తామని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం రోడ్డు భద్రత పోస్టర్ ఆవిష్కరించారు.