2 May, 2026 | 9:23 PM

Breaking News

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం   •   విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •  

యూట్యూబర్ కోమలి ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా?

26-02-2026 12:04 AM
  1. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  2. ప్రేమ వ్యవహారమే కారణం!

శేరిలింగంపల్లి, పిబ్రవరి 25 (విజయక్రాంతి): మణికొండ చిత్రపురి కాలనీలో నివసిస్తున్న ప్రముఖ యూట్యూబర్, విద్యార్థిని కోమలి (21) బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి చెందిన కోమలి హైదరాబాద్‌లో ఉంటూ బీఎస్సీ చదువుతూ, చిత్రపురి కాలనీలోని బంధువుల ఇంట్లో ఉంటోంది. విశాఖపట్నానికే చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, మరో యూట్యూబర్ అయిన నిఖిల్‌రెడ్డిని ఆమె ప్రేమిస్తోంది.

గత కొంతకాలంగా నిఖిల్‌రెడ్డి ఆమెను దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తుండటంతో వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఆరు నెలల క్రితం కూడా కోమలి ఆత్మహత్యాయత్నం చేయగా, బంధువులు కాపా డారు. ఇటీవల పెళ్లి విషయంలో వీరిద్దరి మధ్య మరోసారి తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన కోమలి, సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఆమె తల్లి రాయ దుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

నిఖిల్‌రెడ్డి వేధింపుల వల్లే తన కూతురు చనిపోయిందని బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిఖిల్‌రెడ్డి పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కోమలి ఆత్మహత్యకు అఖిల్ రెడ్డి వేధింపులు ఏమైనా కారణమా? లేదా కేవలం విరహం వల్లనే ఈ నిర్ణయం తీసుకుందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కోమలి మొబైల్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు.. చాటింగ్, కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు.