అర్ధరాత్రి ORRపై యువకుల ప్రమాదకర స్టంట్లు
06-06-2026 12:12 PM
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై యువకుల వీరంగం
హైదరాబాద్: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై(Shamshabad Outer Ring Road) యువకులు వీరంగం సృష్టించారు. అర్ధరాత్రి ఓర్ఆర్ పై కార్ రేసింగ్ తో యువకులు హల్ చల్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రమాదకర విన్యాసాలు చేసిన యువకులు కారు డోర్ పై కూర్చొని స్టంట్లు చేశారు. సామాజిక మాధ్యమాల్లో కార్ రేసింగ్ వీడియోలు వైరల్ గా మారాయి. కార్ రేసింగ్ చేస్తున్న యువకుల తీరుపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకర డ్రైవింగ్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.






