26 June, 2026 | 1:26 PM

సింగరేణి స్ట్రట్ ఇంక్లైన్ గని ప్రమాద అమరులకు శ్రద్ధాంజలి

26-06-2026 12:05 PM

ఇల్లెందు, (విజయక్రాంతి): ఇల్లందు 24 ఏరియా లో మొహర్రం నాడు సింగరేణి కాలరీస్ ఇల్లందు ఏరియా స్ట్రట్ ఇంక్లైన్ గని ప్రమాదంలో  మరణించిన అధికారులు ఉద్యోగులకు జియం వి.కృష్ణయ్య మరియు ఇతర అధికారులు  శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జియం కృష్ణయ్య మాట్లాడుతూ.. 1938వ సంవత్సరం ఇల్లందులో దాదాపు 37 మంది పురుషులు 6 గురు మహిళా ఉద్యోగులు మొత్తం 43 మంది మృతి చెందారు. ఇందులో భాగంగా ప్రతి ఏట వారి జ్ఞాపకార్థం మొహరం నాడు గని ప్రదేశంలో సంస్మరణ సభ నిర్వహించి శ్రద్ధాంజలి ఘటిస్తున్నామన్నారు. నాడు వారు వేసిన బాటలు నేటి భావితరానికి నాంది అయ్యాయి.

ఆనాడు 1886 సం.లో డా.కింగ్ అనే భూగర్భ శాస్త్రవేత్త ఇల్లందు పరిసర ప్రాంతాల్లో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని కనుగొనడం జరిగింది. అప్పుడు ఉన్న బ్రిటీషర్స్ దక్కన్ కంపెనీ పేరా 1889 సం.లో ఇక్కడ బొగ్గు బావులు తవ్వడం ప్రారంబించి మొట్టమొదటిసారిగా సింగరేణిలో 59,671 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ 49 సం.రాలు పనిచేస్తూ ఉన్న క్రమంలో దురదృష్ట వశాత్తు 1938 సం,, మార్చి 12 వ తేదీ ఒక పెద్ద ప్రమాదం సంభవించింది. అనాడు ఈ బ్రిటిషర్స్ కింగ్ సీం ద్వారా చక్కటి నాణ్యమైన బొగ్గును తీస్తూ వస్తున్న సమయంలో ఒక ప్యానల్ స్ట్రట్ ఇంక్లైన్ కు దగ్గరగా 100 మీటర్ లోతులో ఉన్న దానిని 1937 సం.నాడు ప్రారంభించి 9 నెలలుగా పనిచేస్తున్నారు ఆ సమయంలో ఈ సాండ్ స్టోవింగ్ లేటెస్ట్ టెక్నాలజీ లేక కేవలం కేవింగ్ మెథడ్ ద్వారా పనిచేయడం జరిగింది.

ఐసోలేషన్ గోడలు కట్టడం కొరకు అక్కడ ఉన్న షెల్ బొగ్గు పెల్లలతో గోడలు నిర్మించడం కొరకు  పై నుండి బోర్వెల్ వేసి దాని ద్వారా మట్టి నీరు పంపించి గోడలు నిర్మించే ప్రక్రియ జరుగుతున్న సమయంలో 1938 మార్చి 12 వ తేదీ దాదాపు రాత్రి 11:00 గంటలకు ఇక్కడ ఈ ప్రదేశంలో ఉన్న గనుల మేనేజర్ శ్రీ ఆర్.ఎల్. యాండ్రూస్ గారి ఆధ్వర్యంలో పని జరుగుతున్న తరుణంలో అక్కడ ఒక పెద్ద బండ కూలడంతో  విషవాయువులతో పడిపోవడం జరిగింది అదే సమయంలో అక్కడ పనిచేస్తున్న అధికారులు మరియు ఉద్యోగులు వెంటనే వెలువడిన విషవాయువుని పీల్చడం ద్వారా ప్రాణాలు కోల్పోవడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా సింగరేణి వ్యాప్తంగా యాజమాన్యము మొహర్రం పండుగ నాడు సెలవుదినంగా మరియు ఇల్లందు ఏరియా లో శుక్రవారం వారాంతపు సెలవు దినంగా ప్రకటించింది  అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో, జే.కే.పి.ఓ. జాకీర్ హుస్సేన్, డిజియం (సివిల్) రవి కుమార్, జే.కే.మేనేజర్ పి.పుర్ణచందర్, ఇతర అధికారులు దామోదర్, రామదాస్, అంజి రెడ్డి, యాన్.సతీష్, డేవిడ్, జి. సుధాకర్ ఇల్లందు అధికారుల సంఘం అద్యశులు నుండి బి. నాగేశ్వర రావు, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి నజీర్ అహ్మద్, ప్రాతినిధ్యసంఘం ఉపాధ్యక్షుడు జె.వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.