పల్నాడులో ఘోరప్రమాదం..హైదరాబాద్‌కు చెందిన నలుగురు మృతి
26-06-2026 11:46 AM
పల్నాడు: ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మాచర్ల పట్టణం సమీపంలో, వేగంగా దూసుకొచ్చిన తుఫాను వాహనం రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. నలుగురు బాధితులు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారు హైదరాబాద్ వాసులని పోలీసులు వెల్లడించారు. కుటుంబంలో ఒకరు మరణించడంతో వారు పామూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘోర ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు.






