13 May, 2026 | 11:15 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

అవకాశాన్ని వినియోగించుకోవాలి

20-12-2025 01:38 AM

డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి

కోదాడ, డిసెంబర్ 19: ఈ నెల 21 వ తేదీన జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు  సద్వినియోగం చేసుకోవాలని కోదాడ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన, ఇరువైపుల సమ్మతితో సమస్యలను పరిష్కరించుకునే అవకాశం అందుబాటులో ఉందని తెలిపారు. రాజీ చేసుకునే అవకాశమున్న వివిధ రకాల కేసులు క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు,

స్తి విభజన కేసులు, వైవాహిక జీవితం & కుటుంబ సమస్యలకు సంబంధించిన కేసులు, డ్రంకన్ డ్రైవ్, మోటారు వాహన చట్ట ఉల్లంఘనలు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం తదితర కేసులు అని వివరించారు. కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోవద్దని అన్నారు. న్యాయశాఖ అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని సూచించారు.