15 July, 2026 | 5:44 PM

భాగిర్తిపల్లి గ్రామపంచాయతీకి బాడీ ఫ్రీజర్ విరాళం

15-07-2026 05:28 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం భాగిర్తిపల్లి గ్రామపంచాయతీకి జనగామ వాస్తవ్యులు, ప్రముఖ విద్యావేత్త తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి బాడీ ఫ్రీజర్‌ను విరాళంగా అందజేశారు. గ్రామాభివృద్ధికి సహకరించాలని పాలకవర్గ సభ్యులు కోరగా ఆయన వెంటనే స్పందించి బాడీ ఫ్రీజర్‌ను అందించారు. దీంతో గ్రామ ప్రజలకు అవసరమైన సమయంలో ఎంతో ఉపయోగపడుతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ సుభాష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నర్సింలు, ఉపసర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.