15 July, 2026 | 5:56 PM

Breaking News

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

15-07-2026 05:35 PM

నగర మేయర్ కొలగాని శ్రీనివాస్

ముకరంపుర,(విజయక్రాంతి): వనమహోత్సవం సందర్భంగా కరీంనగర్ నగరంలోని 22వ డివిజన్ హిందూపురి కాలనీ సమీపంలో స్థానిక కార్పొరేటర్ బండ రమణ రెడ్డి, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన డివిజన్ ప్రజలకు ఉచిత మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం నగర మేయర్ కొలగాని శ్రీనివాస్  కాలనీ వాసులతో కలిసి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. నగరాన్ని మరింత పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్క నాటి సంరక్షించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హిందూపురి కాలనీ కమిటీ అధ్యక్షులు దామోదర్ రెడ్డి కార్యదర్శి మహేందర్ స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ వాసులు, డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.