5ఏళ్ల చిన్నారిపై 45 ఏళ్ల కామాంధుడి కర్కశం
కూసుమంచి, మార్చి11,(విజయక్రాంతి): కూసుమంచి మండలంలో చాలా అత్యంత అమానుష సంఘటన జరిగింది.. 5ఏళ్ల బాలిక పై 45ఏళ్ల ఓ కామాందుడు కర్కశం చూపించాడు. ఆ బాలిక పై లైంగికి దాడి చేసే ప్రయత్నం చేయగా, బాలిక అరుపులతో స్థానిక మహిళలు కాపాడిన అత్యంత దారుణ సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది..దీంతో సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడ్ని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది..
స్థానికుల సమాచారం మేరకు కూసుమంచి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఐదేళ్ల చిన్నారి మంగళవారం ఉదయం స్కూల్ కు వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి చేరింది. ఆ సమయంలో బాలిక కుటుంబ సభ్యులు వారి పనుల నిమిత్తం బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. బాలిక ఇంటి పక్కనే నివాసం ఉంటున్న 45ఏళ్ల ఓ వ్యక్తి ఎవరు లేని సమయాన్ని అసరగా చేసుకుని బాలికపై అఘాత్యానికి పాల్పడే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో బాలిక పెద్ద ఎత్తున కేకలు వేయడం, అరవడంతో చుట్టుపక్కల ఉన్న స్థానిక మహిళలు ఆ ఇంట్లోకి వెళ్లి చూడగానే నివ్వరబోయారు.
వెంటనే ఆ వ్యక్తిని కొట్టి బాలికను తీసుకుని తక్షణమే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నింధితుడు అక్కడ నుంచి పరారైయ్యాడు. దీంతో సమాచారం అందుకుని హాటాహుటిన ఇంటికి చేరిన తల్లిదండ్రులు బాలికను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలికకు కొంత రక్తస్రావం అయినట్లుగా ప్రచారం జరుగుతోంది.. ప్రస్తుతం బాలిక ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్నట్లు సమాచారం.
కేసు నమోదు..అరెస్ట్..?
మండలంలో బాలికపై దాడికి యత్నించిన సంఘటన సమాచారం కూసుమంచి పోలీసులకు అందింది. దీంతో రంగంలోకి దిగిన కూసుమంచి పోలీసులు ఆ దారుణానికి పాల్పడిన 45ఏళ్ల వ్యక్తి పై కేసు నమోదు చేసి..తక్షణమే అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
విచారణ చేస్తున్న పోలీసులు
5ఏళ్ల బాలికపై 45ఏళ్ల ఓ వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన పై పోలీసు ఉన్నతాధికారులు ముమ్మరంగా విచారణ చేస్తున్నారు. ఏసీపీ స్థాయి అధికారితో పాటు కూసుమంచి సీఐ, ఎస్‌ఐ ఆ బాలిక నివాసాని వెళ్లి జరిగిన సంఘటన పై ఆరా తీసినట్లు తెలుస్తోంది.
అనంతరం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి వెళ్లి బాలికకు జరిగిన పరిస్థితి పై విచారణ చేసి స్టేట్ మెంట్ రికార్బు చేసినట్లు సమాచారం. మొత్తానికి ఇలాంటి సంఘటనతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. చిన్నారిపై ఓ వ్యక్తి చేసిన సంఘటన కూసుమంచి మండలంలో సంచలనంగా మారింది.




