వైద్య కళాశాల కోసం స్థల పరిశీలన
యాదగిరిగుట్ట, మార్చి 11 : యాదగిరిగుట్టలో నూతనంగా నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని సందర్శించి, అక్కడ చేపట్టాల్సిన పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైద్య కళాశాల నిర్మాణ పనులు ఎప్పటి నుండి ప్రారంభించారని , ప్రస్తుతం చేపడుతున్న ఏర్పాట్ల పనులను అధికారులు కలెక్టర్కు వివరించారు.
అనంతరం వైద్య కళాశాల భవనానికి సంబంధించిన నమూనా మ్యాప్ను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు, వైద్య సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు.వైద్య కళాశాల నిర్మాణ పనులను ఆలస్యం చేయకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వైద్య కళాశాల పూర్తయితే జిల్లాలో వైద్య విద్యకు మరింత ప్రోత్సాహం లభించడమే కాకుండా, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ తెలిపారు.పనులు వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అధికారులు, ఇంజినీరింగ్ విబాగం డి. ఈ, తహశీల్దార్ పాల్గొన్నారు.




