20 August, 2026 | 10:49 AM

గోడ కూలి కూలీ మృతి.. పోలీసుల దర్యాప్తు

20-08-2026 09:42 AM

బోధన్,ఆగస్టు20(విజయక్రాంతి): నిజామాబాద్ పట్టణంలో విషాదం జరిగింది. నగరంలోని వినాయకనగర్ లో ఓ ఇంటిపై ఉన్న గోడను కూల్చివేసేందుకు బోధన్ ను కు చెందిన  అడ్డా కూలీ వెళ్లాడు. అయితే గోడను కూలగొట్టే క్రమంలో అకస్మాత్తుగా అది అతడిపై పడింది. దీంతో అక్కడికక్కడే బోధన్ సదరు కూలి మృతి చెందాడు. సమాచారం అందుకున్న 4వ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.