23 June, 2026 | 5:04 AM

లష్కర్‌గూడ బ్రిడ్జి పనులు వెంటనే ప్రారంభించాలి

23-06-2026 12:41 AM

బీఆర్‌ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

అబ్దుల్లాపూర్మెట్, జూన్ 22:  లష్కర్గూడ, సుర్మాయిగూడ, అనాజ్పూర్, మజీద్పూర్, గుంతపల్లి, గండిచెరువు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న ప్రమాదకర బ్రిడ్జి నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని రంగారెడ్డి జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి  అన్నారు.  మాజీ ఎంపీటీసీ సీక సాయి గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం లష్కర్గూడ బ్రిడ్జి వద్ద నిర్వహించిన ధ ర్నా కార్యక్రమంలో పాల్గొన్న మంచిరెడ్డి కి షన్ రెడ్డి మాట్లాడుతూ...  ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ బ్రిడ్జి సమస్యను ప్ర భుత్వం నిర్లక్ష్యం చేయడం బాధాకరమన్నా రు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.6.40 కోట్ల నిధు లు మంజూరు చేయించడంతో పాటు టెండ ర్ల ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు.

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు చేతుల మీదుగా శిలాఫలకం ఆవిష్కరించినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన త ర్వాత ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడం ప్రజల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శ నమని విమర్శించారు. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రజా సమస్యల పరిష్కారం కంటే రాజకీయ పదవులపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారని ఆరోపించారు. శిలాఫలకాలు మార్చడం కాకుండా అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా వ్యవహరించా లని సూచించారు.

వర్షాకాలం ప్రారంభమై న నేపథ్యంలో భారీ వర్షాలు కురిసేలోపు బ్రి డ్జి నిర్మాణ పనులు చేపట్టకపోతే ప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నా రు. గతంలో ఈ బ్రిడ్జి వద్ద జరిగిన ప్రమాదంలో కారు నీటిలో మునిగి ఇద్దరు వ్యక్తు లు మృతి చెందిన ఘటనను గుర్తుచేస్తూ, ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడకూడదన్నారు.వారం రోజుల్లోగా నిర్మాణ పనులు ప్రారంభించకపోతే బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.

అనంతరం సంబంధిత శాఖ అధికారులతో ఫోన్లో మా ట్లాడి, బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షు డు కొత్త కిషన్ గౌడ్, జక్కా రామ్ రెడ్డి, కిరణ్ కుమార్ గౌడ్, తుడుం మల్లేష్, మాజీ ఎంపీటీసీ యాదగిరి, బీఆర్‌ఎస్  నాయకులు, కా ర్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రా మాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.