మహిళా సంఘాలు.. కొండంత అండ
- మంత్రి సీతక్క
- కడ్తాల్ ఎంపీపీ నూతన కార్యాలయం ప్రారంభం
- నియోజకవర్గ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇవ్వాలని ఎమ్మెల్యే కసిరెడ్డి విజ్ఞప్తి
కడ్తాల్, జూన్ 22(విజయక్రాంతి): స్వ యం సహాయక మహిళా సంఘాల్లో సభ్య త్వం కలిగి ఉంటే అవసర సమయంలో ఆ సంఘం మహిళలకు కొండంత అండగా ని లుస్తుందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో నిర్మించిన మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ ) కార్యాలయ భవనాన్ని సోమవారం మం త్రి సీతక్క, చేవెళ్ల ఎంపీ డాక్టర్ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఇతర అధికారులు, నాయకులతో కలిసి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీత క్క మాట్లాడుతూ.. మహిళా సాధికారత కో సం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాల ను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. స్వ యం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు కు టుంబ, గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. మహిళా సంఘా ల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ఇందులో భాగంగానే ఇ ప్పటికే సంఘాలకు రూ.61 వేల కోట్ల రుణాలను అందించామని వెల్లడించారు.
అలాగే, వయోపరిమితి లేకుండా 60 సంవత్సరాలు దాటిన వృద్ధులందరికీ పెన్షన్ అందించే ది శగా ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు. నియోజకవర్గ వ్యా ప్తంగా ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవ లు అందించేందుకు అవసరమైన ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
రూ.100 కోట్లు కేటాయించాలి: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. కల్వకుర్తి నియోజకవర్గ వ్యా ప్తంగా సాగుతున్న అభివృద్ధి పనులకు మరి న్ని నిధులు కేటాయించాలని మంత్రిని కోరా రు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల భవనాల నిర్మాణానికి సహకరించాలని కోరు తూ, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశారు.
హామీలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎంపీ మల్లు రవి
నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీల అమలుకు కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వాల వైఫల్యాలు, అవినీతి వల్ల రాష్ట్రం అప్పు ల భారంలో చిక్కుకుపోయిందని, అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నాయకుడు కేటీఆర్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని, రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం స్థాయిని కూడా గౌరవించకుండా మాట్లాడితే ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
రాష్టంలో బీజేపీ నాయకులు రాష్ట్ర ప్ర భుత్వంపై విమర్శలు చేయడం మాని, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇప్పిస్తే తెలంగా ణ ఎంపీలందరూ కలిసి రాష్ట్ర నిధుల కోసం మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని ఎంపీ స్పష్టం చేశారు. కార్యక్రమం లో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు ఆసిఫ్ అలీ, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్, కొప్పిసెట్టి కిరణ్మయి,
జెడ్పీ సీఈఓ సీహెచ్ కృష్ణారెడ్డి, డీఆర్డీఓ శ్రీలత, ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, డీపీఓ సురేష్ మోహన్, ఈఈ సుదర్శన్ రెడ్డి, డిప్యూటీ ఈఈ శ్రీనివాస్, తహసీల్దార్ జయశ్రీ, సీడీపీఓ శాంతిరేఖ, ఏఎంసీ చైర్మన్ యాట గీత, వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్, ఎంపీడీవో సుజాత, ఏఈ పరమేష్, ఎంపీఓ లాలయ్య, రాష్ట్ర నాయకులు ఇందిరా శోభ, బాలాజీ సింగ్,బొజ్జ సంధ్యారెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్ల రవికాంత్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ సర్పంచ్ లు బిక్షపతి, కరుణాకర్ గౌడ్ మహేందర్ గౌడ్,శ్రీనివాస్ రెడ్డి, రఘురాములు,గుజ్జల మహేష్,శంకర్ పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు మరియు రాజకీయ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.






