11 March, 2026 | 3:35 PM

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

11-03-2026 01:25 AM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో కలెక్టర్ హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 10(విజయక్రాంతి): మహిళలు అన్ని రంగాలలో రాణించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, సిర్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల్ల మంగ, జిల్లా మహిళా సమైక్య  ప్రతినిధి వనితలతో కలిసి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్ర మాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించాలని, అందరికీ ఆదర్శంగా ఉన్నత స్థానానికి ఎదగాలని, ప్రతి మహిళ సాటి మహిళకు అండగా నిలబడాలని తెలిపారు. సిర్పూర్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలలో ఎందరో మహిళలు దేశ ప్రధానిగా, రాష్ట్రపతులుగా పదవులు చేపట్టి దేశానికి సేవలు  అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్, జిసిడి ఓ శకుంతల, అధికారులు, మహిళా ఉద్యోగులు, జిల్లా మహిళా సాధికారత సభ్యులు శారద, రాణి, రాజేశ్వరి, మమత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.