26 February, 2026 | 3:48 AM

పాదయాత్రకు మద్దతుగా మహిళా న్యాయవాదుల నిరాహార దీక్ష

26-02-2026 12:05 AM

మహబూబ్ నగర్ టౌన్, ఫిబ్రవరి 25 : లీగల్ నెవాదుల రక్షణ చట్టం కోసం పాదయాత్ర చేపడుతున్నటువంటి న్యాయవాదులకు మద్దతుగా మహబూబ్ నగర్ న్యాయవాదుల సంఘం లోని మహిళా న్యాయవాదులు బుధవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో మహిళా న్యాయవాదుల పక్షాన ఉమామహేశ్వరి ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయవాదులకు రక్షణ చట్టం తప్పనిసరిగా రావాలని అన్నారు. రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు పెరిగిపోయాయని అదే విధంగా హత్యలు కూడా జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పాదయాత్రలకు మద్దతుగా ఈ దీక్ష చేపట్టడం జరిగిందని అన్నారు ప వెంటనే స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకువచ్చి అమలు జరిగేలా చూడాలని ఆమె డిమాండ్ చేశారు మహిళా న్యాయవాదులు నేహా,సబితా,ధనలక్ష్మి,మమత, ప్రభావతి, నిర్మల,హుమేరా అల్ధమిష్ బేగం, డి నిర్మల లు దీక్షలో ఉన్నారు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రావు లతోపాటు మాజీ అధ్యక్షుడు చంద్రమౌళి ఇతర సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.