కేరళం సీఎం ఎవరు?
- కాంగ్రెస్ శ్రేణుల్లో ఎడతెగని ఉత్కంఠ
- రేసులో ముగ్గురు నేతలు
- సోషల్ మీడియా వేదికగా వార్
త్రివేండ్రం, మే ౬: కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని డీఎఫ్ కూటమి ఘనవిజయం సాధించింది. కానీ, ఆ పార్టీ నుంచి సీఎంగా ఎవరు ఎంపిక అవుతారనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిం ది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేసులో విపక్ష నేత వీడీ సతీశన్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితాల ఉన్నారు. వీరిలో సీఎం ఎవరనే అంశం పై కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే సోషల్ మీడియాలో అభిమానుల మధ్య సోషల్‌మీడి యా వేదికగా యుద్ధం జరుగుతోంది.
ఒక్కో నేత మద్దతుదారులు తమ నాయకుడే తదుపరి ముఖ్యమంత్రి కావాలని పోస్టులు పెడు తున్నారు. ఒకవేళ తమకు అభిమాన నేతకు పదవి ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని కొందరు నేతలు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా అధిష్ఠానం మాత్రం సతీశన్, వేణుగోపాల్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచా రం జరుగుతున్నది.
అయితే.. ఇద్దరూ దిగ్గజ నేతలే అయినప్పటికీ, ఇద్దరిలో ఎవరు సీఎం పీఠాన్ని అధిష్ఠిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సీనియర్ నేత రమేష్ చెన్నితాల కూడా సీఎం పదవిని ఆశిస్తున్నారు. కానీ, సోషల్ మీడియా పోస్టులు మాత్రమే ముఖ్యమంత్రి పదవిని కట్టబెడతాయని తాను నమ్మడం లేదని తేల్చిచెప్పారు. అధిష్ఠానం నిర్ణయమే తమకు శిరోధార్యమని స్పష్టం చేశారు.






