9 May, 2026 | 11:24 AM

Breaking News

కరీంనగర్ బంద్ ప్రశాంతం   •   పశ్చిమ బెంగాల్ సీఎం ప్రమాణస్వీకారం.. పాల్గొన్న ప్రధాని మోదీ   •   ఒంగోలులో భూకంపం.. భయపడ్డ జనం   •   కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి నియామకం   •   నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ కృష్ణస్వామినాథ‌న్ నియామ‌కం   •   గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •  

సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

20-11-2025 05:08 PM

మండలం అధ్యక్షుడు దరాస్ వార్ సాయిలు..

బిచ్కుంద (విజయక్రాంతి): మద్నూర్ మండలంలో గురువారం జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో, రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంత్ రావు చేపట్టిన అభివృద్ధి పనులను గ్రామాల్లో ప్రజలకు చేరవేయాలని కాంగ్రెస్ కార్యకర్తలను మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దరాస్ వార్ సాయిలు పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వల్ల ప్రజలకు విస్తృతంగా లాభాలు అందుతు న్నాయని,ముఖ్యంగా మద్నూర్ మండలానికి అత్యధిక నిధులు మంజూరు అయ్యాయని, ఈ అభివృద్ధిని ఇంటింటికీ తీసుకెళ్లి ప్రచారాన్ని ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

అధిష్ఠానం చెప్పినట్టు ఐకమత్యం పాటిస్తూ,సమన్వయ లోపం లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని,ప్రతి గ్రామం  ప్రతి వార్డులో కాంగ్రెస్ నాయకులు అహర్నిశలు కృషి చేయాలని ఆయన సూచించారు.పార్టీ అభివృద్ధి కోసం అవసరమైతే,గ్రామాల్లో విస్తృత పర్యటనలు చేసి, కార్యకర్తలతో కలిసి పనిచేస్తామని దరాస్ వార్ సాయిలు హామీ ఇచ్చారు.జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు అభివృద్ధి పరంగా తొంభై శాతం శ్రమ పెట్టి, మండల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు. సమావేశంలో మండల కాంగ్రెస్ నాయకులు హనుమాన్ మందిర్ ఆలయ చైర్మన్ రామ్ పటేల్,సోసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ హన్మంత్ యాదవ్, మండల కాంగ్రెస్ నాయకులు గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.