10 April, 2026 | 1:55 AM

మెరుగైన వైద్య సేవలు అందిస్తాం

10-04-2026 12:14 AM

డిప్యూటీ డీఎంహెచ్‌ఓ భీమా నాయక్ 

కల్వకుర్తి ఏప్రిల్ 9: వృద్ధులకు ఎల్లవేళలా వైద్య సేవలు అందిస్తామని డిప్యూటీ డీఎంహెచ్ ఓ భీమా నాయక్ అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా కల్వకుర్తి పట్టణంలోని వృద్ధాశ్రమంలో గురువారం జిజిహెచ్, రఘుపతి పేట పి.హెచ్.సి సబ్ సెంటర్ వైద్యులు, సిబ్బంది వైద్య శిబిరం నిర్వహించారు.

కార్యక్రమంలో రఘుపతిపేట పిహెచ్ సి డాక్టర్ అత్త ఉల్లా ఖాన్, ఎం ఎల్ హెచ్ పి డాక్టర్ వర్షిత్ రెడ్డి, హెల్త్ సూపర్వైజర్ ప్రమోద్, బి ఎస్ కే ప్యాలెట్ సేవా కేంద్రం నర్సింగ్ ఆఫీసర్ విజయలక్ష్మి, ఫిజియోథెరపిస్ట్ లలిత, వృద్ధాశ్రమ నిర్వాహకుడు వెంకటయ్య, కోఆర్డినేటర్ పద్మ, వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.