1 May, 2026 | 10:47 AM

రైతుకు ఎటువంటి ఇబ్బంది కలుగనియ్యం

01-05-2026 12:35 AM

కొత్తపల్లి, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతును అన్నివిధాలా ఆదుకుంటుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని నరేందర్ రెడ్డి ప్రారంభించారు.

తరువాత రైతులతో మాట్లాడుతూ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని గత ప్రభుత్వంలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేకున్నా రుణమాఫీ,రైతు భరోసా,సన్నాలకు బోనస్ ఇలా అనేక రకాలుగా రైతులను ఆదుకోవడం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిఈవో రమేష్, కార్పోరేటర్లు గాదె రూప శ్రీనివాస్,మేకల వెంకటేష్, నాయకులు కాంరెడ్డి రాంరెడ్డి, బీరం ఆంజనేయులు,కపిల్ మాధవ్,శ్రీధర్ రెడ్డి,రాజి రెడ్డి, వెంకటేష్, సాయిని తిరుపతి,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.