17 July, 2026 | 2:40 PM

Breaking News

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు సహకారం   •   మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి   •   స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి   •   నందిపేట తహసీల్దార్ సస్పెండ్   •   పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •  

స్మశాన వాటికలో నీటి సౌకర్యం ఏర్పాటు

18-03-2026 05:27 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్మశాన వాటికల్లో నెలకొన్న సమస్యలపై మున్సిపల్ నూతన పాలకవర్గం స్పందించింది. గత నాలుగు రోజుల క్రితం మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి స్థానిక కౌన్సిలర్ లు, స్మశాన వాటిక కమిటీ సభ్యులతో కలిసి సందర్శించారు.  కనీసం నీటి సౌకర్యాలు కూడా లేకుండా స్మశాన వాటిక నిర్వహణ కొనసాగడం ఆశ్చర్యానికి గురించేసింది.

స్మశాన వాటికల్లో పారిశుద్యం, నీటి సౌకర్యం కొరకై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో మరుసటి రోజు పారిశుధ్యం పనులు పూర్తి చేసి ఇచ్చిన మాట ప్రకారం నాలుగు రోజుల్లో మంచిర్యాల చౌరస్తాలోని స్మశానవాటికలో నీటి సౌకర్యం కలిపించారు. నిర్మల్ మున్సిపల్ పరంగా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిచడం జరుగుతదని, అత్యవసరమైన సమస్యలపై వేగంగా చర్యలు తోసుకోవడం జరుగుతదని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పట్టణ ప్రజలకు వివరించారు.