11 May, 2026 | 12:17 PM

Breaking News

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •   రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు   •   తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు   •  

బచ్చన్నపేట రోడ్డు దుమ్ము సమస్యపై గ్రామస్తులు వినూత్న ధర్నా

24-02-2026 12:00 AM

అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డ గ్రామస్తులు

బచ్చన్నపేట. ఫిబ్రవరి 23 విజయక్రాంతి : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కేంద్రంలోని నేషనల్ హైవే 365 బి. పోలీస్ స్టేషన్ నుంచి కొడవటూరు కమాన్ వరకు అత్యంత ప్రమాదకరంగా మారిన రోడ్డును పునర్ నిర్మించాలని కోరుతూ ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్న పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన. విపరీత దుమ్ము కారణంగా శ్వాసకోశ వ్యాధుల బారి న పడుతున్నామని.

బచ్చన్నపేట ప్రజలు సోమవారం బందుకు పిలుపునిచ్చి పెద్ద ఎత్తున రాస్తారోకో ధర్నా నిర్వహించారు. దీంతో జనగామ, ఆలేరు, సిద్దిపేట వైపు వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఫైట్ ఫర్ బచ్చన్నపేట సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన బందులో వ్యాపార వాణిజ్య సంస్థలో దుకాణాలు అన్ని మూసి ఉంచా రు. అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అధ్వానంగా తయారైన రోడ్డుతో ప్రజలు ఇబ్బం దులు పడుతున్న పట్టించుకునే వారు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారి కావడంతో నిత్యం వేలాది వాహనాలు ఈ రోడ్డు గుండా వెళ్తుంటాయని, దాంతో గుంతల మయమైన రోడ్లతో దుమ్ము లేచి రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటున్న దుకాణదారులకు ఇబ్బందికరంగా మారిందన్నారు.

20 రోజుల కింద బచ్చన్నపేటలో రోడ్డు నిర్మాణం కోసం రెండు గంటల పాటు భారీ ఎత్తున రాస్తారోకో ధర్నా నిర్వహించామని, ఫలితంగా ఎస్‌ఐ హమీద్ ఆధ్వర్యంలో తహసిల్దార్ హుస్సేన్ సంఘటన స్థలానికి వచ్చి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి రోడ్డు నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటాను హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించామని వెల్లడించారు.

హామీ ఇచ్చి 20 రోజులు దాటినా కూడా అధికారులు పట్టించుకోకపోవడంపై బందుకు పిలుపు ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు. జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకునే వరకు రాస్తారోకో ధర్నా విరమించేది లేదని పట్టు పట్టికూర్చున్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా కూడా పట్టించుకోకపోతే ప్రభుత్వాలు అధికారులు ఉండి ఎందుకని వారు ప్రశ్నించారు.

అవసరమైతే ఇక్కడనే వంటవార్పు చేసుకుని ఆందోళన కొనసాగి స్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫైట్ ఫర్ బచ్చన్నపేట సంస్థ ప్రతినిధులు, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బిజెపి, సిపిఐ, సిపిఎం పార్టీల నేతలతో పాటు పట్టణ ప్రజలు, వ్యాపార వాణిజ్య సంస్థలు దుకాణదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.