7 June, 2026 | 8:03 PM

సత్యసాయి జిల్లాలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం

07-06-2026 06:25 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రైల్వే స్టేషన్ వద్ద వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం తప్పింది. కాచిగూడ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు రెండు ఆవులు అకస్మాత్తుగా అడ్డురావడంతో రైలు వాటిని ఢీకొట్టింది. పెద్ద శబ్దం రావడంతో లోక్ పైలట్ వెంటనే అప్రమత్తమై రైలును నిలిపివేశారు. ఈ ఘటనలో రైలు ఇంజిన్ ముందు భాగం స్వల్పంగా ధ్వంసమవగా, ఓ ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది.  లోకో పైలట్లు ఇంజిన్‌ను తనిఖీ చేసి సురక్షితంగా ఉందని నిర్ధారించడంతో, అరగంట ఆలస్యంగా రైలు బెంగళూరుకు బయలుదేరింది.