అకాల వర్షం.. రైతన్నకు నష్టం
నేలపాలైన నోటికాడి పంట..
మహబూబాబాద్, మే 6 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగా మ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వివిధ మండలాల్లో విక్రయానికి సిద్ధం చేసిన పంట ఉత్పత్తులు మంగళవా రం రాత్రి కురిసిన అకాల వర్షాలు నీటిపాలయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్, పలిమెల, మహా ముత్తారం, కాటారం, మలహర్రావు, ఘనపూర్, భూపాలపల్లి, ములుగు జిల్లా గోవిందరావుపేట, తాడువాయి, కన్నాయిగూడెం, వాజేడు, జనగామ జిల్లాలో పలుచోట్ల మంగళవారం రాత్రి అకాల వర్షాలు కురవడంతో రైతులు విక్రయానికి సిద్ధం చేసి కొనుగోలు కేంద్రా ల్లో పోసిన ధాన్యం, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి.
గాలి దుమారానికి మొ క్కజొన్న, ధాన్యం రాశులపై కప్పుకున్న తార్పాలిన్లు గాలికి ఎగిరిపోయా యి. అనంతరం కురిసిన వర్షానికి వరదలో కొన్ని చోట్ల పంట ఉత్పత్తులు నీటిలో కొట్టుకుపోయాయి. మిగిలిన ధాన్యం రాశులు తడిసిపోయాయి. ఎగుమతికి సిద్ధం చేసి కాంటాలు పెట్టి బస్తాల్లో నింపి న ధాన్యం కూడా తడిసిపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు తీరా విక్రయించే సమయంలో అకాల వర్షాలు అన్న దాతలను కోలుకోని విధంగా దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొనుగో లు కేంద్రాల్లో నిర్వాహకుల నిర్లక్ష్యం, లారీల కొరత, హమాలి కార్మికుల కొరత తదితర అంశాలతో కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తుందడం, తొందరగా కొనుగోలు ముగించకపోవడం వల్ల అకాల వర్షాలతో తాము నిండా మునిగే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు. ప్ర భుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మొక్కజొన్న ఉత్పత్తుల కొనుగోళ్లను వేగవంతం చేయాలని, తడిసిన పంట ఉత్పత్తులను లేకుండా పూర్తిగా ప్రభుత్వమే కొను గోలు చేయాలని కోరుతున్నారు.






