బొగ్గు నాణ్యతపై అవగాహన
మందమర్రి,(విజయక్రాంతి): బొగ్గు నాణ్యత, వినియో గదారుల అవసరాల దృష్ట్యా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి-రాబోయే సవాళ్లను ఏ విధంగా అధిగమించాలనే అంశంపై మంగళవారం మందమర్రి ఇల్లందు క్లబ్ లో మార్కెటింగ్ క్వాలిటీ ఉన్నతాధికారులు మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో డైరెక్టర్ (ప్లానింగ్ & ప్రాజెక్ట్స్) కే.వెంకటేశ్వర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై సంబంధిత అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. జీఎం క్వాలిటీ కార్పొరేట్ ఏ.రవికుమార్ మాట్లాడుతూ అధికారుల నుంచి క్షేత్రస్థాయిలో పని చేసే ఉద్యోగికి కూడా నాణ్యతపై అవగాహన అవసరమని తెలిపారు.
ఈ సమావేశంలో టి.శ్రీనివాస్ జి.ఎం కోఆర్డినేషన్ అండ్ మార్కెటింగ్ కార్పొరేట్, హైదరాబాద్, మందమరి ఏరియా జనరల్ మేనేజర్ N.రాధాకృష్ణ, బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కె.విజయభాస్కర్ రెడ్డి, రీజనల్ క్వాలిటీ బెల్లంపల్లి రీజియన్, పి.వీరభద్రరావు, రీజినల్ క్వాలిటీ జనరల్ మేనేజర్ రామగుండం రీజియన్, సుజోయ్ ముజేందర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియా ఉన్నతాధికారులు, పాల్గొన్నారు.




