4 April, 2026 | 8:14 PM

ఆదివాసి ఎరుకల సంఘం సుల్తానాబాద్ మండల అధ్యక్షునిగా ఉండాటి రమేష్

04-04-2026 06:34 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల అధ్యక్షునిగా ఉండాటి రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు అంగడి కుమార్ ప్రకటించారు. శనివారం స్థానిక విశ్రాంతి భవనంలో తెలంగాణ ఆదివాసి జిల్లా అధ్యక్షులు అంగడి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పూర్తిస్థాయి కమిటీని తర్వాత సమావేశంలో ఎన్నుకోవడం జరుగుతుందని జిల్లా అధ్యక్షులు అంగడి కుమార్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా నూతనంగా నియామకం అయిన తెలంగాణ ఆదివాసి సుల్తానాబాద్ మండల అధ్యక్షులు ఉండాటి రమేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో సుల్తానాబాద్ మండల అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు జిల్లా అధ్యక్షులు అంగడి కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజులలో తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘాన్ని సుల్తానాబాద్ మండలంలో బలోపేతం చేస్తానన్నారు. తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘాన్ని గ్రామ గ్రామాన బలోపేతం చేసి, కమిటీలను ఎన్నిక చేస్తానన్నారు. తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను చేస్తామన్నారు.

ఆదివాసి ఎరుకల కులం,అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, వారికి విద్య రాజకీయ రంగాలలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నూతనంగా మండల అధ్యక్షునిగా ఎన్నికైన ఉండాటి రమేష్ ను జిల్లా అధ్యక్షుడు అంగడి కుమార్ రేవెల్లి ఎల్లయ్య శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం సీనియర్ నాయకులు రేవెల్లి ఎల్లయ్య, ఉండాడి నరేష్, ఉండాడి నవీన్, రేవెల్లి అంజి, గణేష్, లచ్చయ్య, సాయి కనకమ్మ తో పాటు ఎరుకల సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.