బాసర చోరీ కేసులో ఇద్దరు దొంగలు అరెస్ట్
వెండి కిరీటం నగదు స్వాధీనం
నిర్మల్ ,జులై౨ ( విజయ క్రాంతి) నిర్మల్ జిల్లా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం బాసర దుర్గామాత ఆలయంలో గత నెల 22న జరిగిన దొంగతనం కేసును చేదించినట్టు జిల్లా ఎస్ పీ జానకి షర్మిల తెలిపారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. గుంటూరుకు చెందిన పల్లపు ఏడుకొండలు, నిజామాబాద్ కు చెందిన గైని కిరణ్ అలియాస్ రామకృష్ణ పాత నేరస్తులని తెలిపారు. పలు దొంగతనాల కేసుల్లో నిందితులుగా ఉన్న వీరు నిజాంబాద్ జిల్లా కేంద్రం కలుసుకొని బాసరలో చోరీ చేసేందుకు తెలిపారు.
రైల్వే ద్వారా బాసర చేరుకున్న వీరు అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించి కాళీమాత ఆలయంలో వెండి కిరిటం నగదు ఉండిని ఎత్తుకొని పోయారన్నారు. రైల్వే ద్వారా పరారీ అయినట్టు తెలిపారు. దొంగలను పట్టుకునేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆరు బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక సాయంతో నేరస్తులను గుర్తించడం జరిగిందన్నారు. దొంగిలించిన సొమ్మును మహారాష్ట్రలో అమ్ముకునేందుకు వెళ్తున్న ఇద్దరు నిందితులను బాసర వద్ద పట్టుకొని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు.
వారి వద్ద నుంచి వెండి కిరీటం 16 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిద్దరిని అరెస్టు చేసినట్టు తెలిపారు.నిందితులు ఏడుకొండలు 25 దొంగతనం కేసుల్లో నిందితుర్రని రామకృష్ణ 20 దొంగతనాలు నేరస్తుడని తెలిపారు. వెండి కెరటాన్ని దాచిన మహారాష్ట్రకు ఆనంద్ పై కూడా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కేసులు పది రోజుల్లోనే చేదించిన ముధోల్ సిఐ రవీందర్ నాయక్ బాసర ఎస్త్స్ర దీపక్ టౌన్ ఎస్‌ఐ సమ్మయ్య పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఇటువంటి దొంగతనం దొరక్కుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు






