జాబ్ సెర్చింగ్ వెళ్తుండగా రోడ్డు ప్రమాదం...
ఇద్దరికి తీవ్ర గాయాలు
అలంపూర్: జాబ్ సెర్చింగ్ కోసం ఇద్దరు యువకులు బైక్ పై హైదరాబాద్ కు వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటన గద్వాల జిల్లా ఉండవల్లి మండలం 44వ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కరిముద్దుల గ్రామానికి చెందిన మాధవరెడ్డి (28) వర్నాత్ రెడ్డి (30 )లు జాబ్ సెర్చింగ్ రిత్యా ఒకే బైకుపై హైదరాబాదుకు వెళ్తున్న క్రమంలో ఉండవల్లి స్టేజి శివారు చేరుకోగానే గుర్తుతెలియని వాహనం వచ్చి వీరు ప్రయాణిస్తున్న బైకును ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్య చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఈఎంటి రాధ మోహన్, పైలట్ కృష్ణ తెలిపారు.




