సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన న్యాయవాదులు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): న్యాయవాదుల రక్షణ కోసం ఏర్పాటుచేసిన న్యాయవాదుల రక్షణ బిల్లు ను తెలంగాణ ప్రభుత్వ మంత్రి వర్గం ఆమోదించి అసెంబ్లీ లో బిల్ పాస్ చేయడం పట్ల మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు స్థానిక కోర్టు ముందు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఇటీవల పలు బార్ అసోసియేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించుకొని న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టం బిల్లును మంత్రి మండలి ఆమోదించడం అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం శుభ పరిణామమని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి వర్గ సహచరులకు సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.




