4 September, 2026 | 12:23 AM

డాక్టర్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

03-09-2026 | 11:08pm

- మహిళా కానిస్టేబుల్ ను అసభ్యకరంగా దూషించిన డాక్టర్ 

- సహారా దవాఖాన ఎదుట గిరిజన సంఘాల ధర్నా 

- ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కానిస్టేబుల్

ఎల్బీనగర్: గత రెండు రోజుల క్రితం ఎల్బీనగర్ శ్రేష్ట ఆరెంజ్ హాస్పిటల్ యాజమాన్యానికి, సహారా హాస్పిటల్ మధ్య వివాదం ఉన్నది. జరిగిన వివాదంలో బందోబస్తు కొచ్చిన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్(LB Nagar Police Station)లో విధుల్లో ఉన్న గిరిజన మహిళా కానిస్టేబుల్(Tribal woman constable)పై తీవ్ర మైనటువంటి పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేసిన సహారా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంకురి శెట్టి నరేశ్ పై, అతని అనుచరులపై వెంటనే ఎస్సీ. ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గురువారం మన్సూరాబాద్ లోని సహారా దవాఖాన ఎదుట గిరిజన సంఘాల నాయకులు, గిరిజన విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టారు.

సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఎల్బీనగర్ లోని శ్రేష్ట ఆరెంజ్ హాస్పిటల్ యాజమాన్యానికి, సహారా హాస్పిటల్ ఎండీ డాక్టర్ సుంకురి శెట్టి నరేష్ తదితరులకు మధ్య కొంతకాలంగా ఆర్థిక లావాదేవీల విషయంపై వివాదం కొనసాగుతుందన్నారు. ఈ విషయంలో కోర్టులో నడుస్తుంది. ఈ క్రమంలో మంగళవారం నరేశ్ తన అనుచరులతో కలిసి కోర్టు ఆర్డర్ ఉందని ఆరెంజ్ హాస్పిటల్ కు వచ్చాడు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. సమచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు అక్కడికి బందోబస్తుకు వచ్చారు.

అక్కడ విధుల్లో ఉన్న ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ కు చెందిన గిరిజన కానిస్టేబుల్ సంధ్యాబాయిని డాక్టర్ నరేశ్ తీవ్రంగా దూషిస్తూ... అభ్యంతరమైన పదజాలంతో దూషించినట్లు ఆరోపించారు. ఈ మేరకు మహిళా కానిస్టేబుల్ సంధ్యాబాయి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో డాక్టర్ నరేశ్ పై ఫిర్యాదు చేసింది. ఈ విషయం పోలీసులు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. లీగల్ ఓపీనియన్ తీసుకుని కేసు దర్యాప్తు చేస్తామని ఎల్బీనగర్ పోలీసులు తెలిపారు. ఆనంతరం వనస్థలిపురం ఏసీపీ కార్యాలయంలో గిరిజన సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు.