ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
* గరిడేపల్లిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా బైక్ ర్యాలీ
గరిడేపల్లి,(విజయక్రాంతి): ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పాలన లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని మండల పార్టీ అధ్యక్షులు త్రిపురం అంజన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మండల కేంద్రంలో పార్టీ నాయకులు ఆనందోత్సవాల మధ్య బైక్ ర్యాలీ నిర్వహించారు.
వారు మాట్లాడుతూ రైతు రుణమాఫీ రైతు భరోసా ఉచిత విద్యుత్ గ్యాస్ సిలిండర్ ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డులు సన్న బియ్యం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వడ్డీ లేని రుణాలు వంటి పథకాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిందని అన్నారు. మంత్రి ఉత్తం సహకారంతో హుజూర్నగర్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్నారు.






