విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య
- అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) డాక్టర్ కె.కిరణ్మయి
- బహదూర్‌గూడ, సరూర్‌నగర్‌లో క్షేత్రస్థాయి తనిఖీలు
ఎల్బీనగర్: ప్రభుత్వ విద్యా సంస్థలో నాణ్యమైన విద్య లభిస్తుందని, ప్రభుత్వ సంస్థల్లో ఉత్తమ సేవలు ప్రజలకు అందుతున్నట్లు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) డాక్టర్ కె.కిరణ్మయి(Additional Collector Dr. K. Kiranmayi) అన్నారు. బహదూర్‌గూడ(Bahadurguda), సరూర్‌నగర్‌లో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. బహదూర్‌గూడ, సరూర్‌నగర్ ప్రాంతాల్లో పలు ప్రభుత్వ సంస్థలను సందర్శించి, అక్కడ కొనసాగుతున్న సేవలు, విద్యా కార్యక్రమాలు, వైద్య సేవలను పరిశీలించారు.
మండల ప్రజా పరిషత్ పాఠశాల బహదూర్‌గూడ, అంగన్‌వాడీ కేంద్రం(Anganwadi Center), ప్రీ-ప్రైమరీ పాఠశాల బహదూర్‌గూడ, అప్పర్ ప్రైమరీ స్కూల్ సరూర్‌నగర్, సరూర్ నగర్ లోని జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రంలో విద్యార్థులు, వైద్యులు, సిబ్బందితో మాట్లాడి, విద్యార్థులకు అందుతున్న శిక్షణ, నిర్వహిస్తున్న తరగతులు, అందుబాటులో ఉన్న పునరావాస సేవలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల పురోగతిని సమీక్షించి, దివ్యాంగులకు నాణ్యమైన సేవలు సమర్థవంతంగా అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.






