కూలిపోకముందే కదిలిన చైర్‌పర్సన్..!
వర్షాకాలంలో ప్రాణాలకు ముప్పుగా మారిన శిథిల విద్యుత్ స్తంభాలు
యుద్ధప్రాతిపదికన కొత్త పోల్స్ ఏర్పాటుకు ఆదేశాలు
రామాయంపేట,(విజయ క్రాంతి): ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాదు… ప్రమాదాన్ని ముందే అడ్డుకోవడమే అసలు పాలన అని నిరూపిస్తూ రామాయంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు(Municipal Chairperson Gajawada Lavanya Nagaraju) 1వ వార్డులో గల్లీగల్లీ లొ పర్యటించి శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభాలను గుర్తించారు. వర్షాల నేపథ్యంలో వెంటనే కొత్త పోల్స్ ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ ఏఈతో చర్చించి అత్యవసర చర్యలకు శ్రీకారం చుట్టారు.
ప్రజల భద్రతే లక్ష్యంగా మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు విస్తృతంగా పర్యటించారు. గల్లీగల్లీ తిరిగి శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాలను స్వయంగా పరిశీలించి, వర్షాకాలంలో అవి ఎప్పుడైనా కూలి ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.






