30 August, 2026 | 10:09 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

జాగ్రత్తలతోనే శ్వాసకు స్వేచ్ఛ

05-05-2026 02:43 AM

స్వేచ్ఛగా శ్వాసించి ఆస్తమాకు చెక్ పెట్టండి

నేడు అంతర్జాతీయ ఆస్థమా దినోత్సవం

ప్రతి సంవత్సరం మే నెల మొదటి మంగళవారం ప్రపంచ ఆస్థమా దినోత్సవంగా నిర్వ హిస్తారు. ఈ ఏడాది కూడా ఆస్థమాపై అవగాహన పెంచడం, సరైన చికిత్స అందించడం లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో గాలి కాలుష్యం, ట్రాఫిక్, జీవనశైలి మార్పులు కారణంగా ఆస్థమా బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నారు.

ఆస్థమా అంటే ఏమిటి?

ఆస్థమా అనేది శ్వాసనాళాల్లో ఇన్ఫ్లమేషన్ (వాపు) కలిగించే దీర్ఘకాలిక వ్యాధి. దీనివల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, వీజింగ్ (శ్వాసలో శబ్దం) ప్రధాన లక్షణాలు.

హైదరాబాద్‌లో పరిస్థితి

హైదరాబాద్‌లో వాహనాల పెరుగుదల, నిర్మాణ పనులు, ధూళి, పారిశ్రామిక కాలు ష్యం వల్ల గాలి నాణ్యత దిగజారుతోంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అలర్జీ సమస్య లు ఉన్నవారు ఆస్థమాకు ఎక్కువగా గురవుతున్నారు. వింటర్, మాన్సూన్ సీజన్లలో ఈ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి.

ముఖ్య కారణాలు: గాలి కాలుష్యం (పొల్యూషన్), ధూళి, పొగ, అలర్జెన్లు, ధూమపా నం, పాసివ్ స్మోకింగ్, వాతావరణ మార్పులు, కుటుంబ చరిత్ర 

లక్షణాలు: తరచూ దగ్గు, రాత్రివేళల్లో శ్వాస ఇబ్బంది, ఛాతిలో బిగుతు, శ్వాస తీసుకునేప్పుడు శబ్దం (హెరిడిటీ)

నివారణ.. జాగ్రత్తలు

గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతా ల్లో మాస్క్ ధరించడం, ఇంట్లో ధూళి పేరుకుపోకుండా శుభ్రత పాటించడం, ధూమపానం పూర్తిగా మానేయడం, వైద్యుల సూచనల మేరకు ఇన్‌హెల్లర్లు వాడడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం.

ఆధునిక చికిత్సలు

ఆస్థమా నిర్ధారణకు స్పైరోమెట్రీ వంటి పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఇన్‌హెల్లర్ థెరపీ, నెబ్యులైజేషన్, అవసరమైతే బయోలాజికల్ థెరపీలు కూడా అందిస్తున్నారు. సరైన చికిత్సతో ఆస్థమాను పూర్తిగా నియంత్రించవచ్చు. ఆస్థమా ఉన్నవారు భయపడాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చు. ముఖ్యంగా పిల్లల్లో ఆస్థమాను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ‘ఆస్థమా ఉన్నా జీవితం ఆగదు. అవగా హన, జాగ్రత్తలతో శ్వాసను కాపాడుకోవచ్చు’. ఈ ప్రపంచ ఆస్థమా దినోత్సవం సందర్భంగా ప్రతి కుటుంబం ఆస్థమాపై అవగాహన పెంచుకొని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చు కోవాలి.

-డాక్టర్ జీ అవినాష్, హెచ్‌ఓడీ, 

కన్సల్టెంట్ పల్మోనాలజిస్ట్ 

కిమ్స్ హాస్పిటల్స్, కొండాపూర్