30 August, 2026 | 10:09 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

2,789 మందికి పట్టాలు ప్రదానం

05-07-2026 12:00 AM

పద్మశ్రీ చింతకింది మల్లేశానికి గౌరవ డాక్టరేట్ ప్రదానం

ఘట్‌కేసర్, జూలై 4 (విజయక్రాంతి): అ నురాగ్ విశ్వవిద్యాలయం శనివారం 3వ వా ర్షిక స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. అలాగే ఇంజినీరింగ్, ఫార్మసీ, మే నేజ్మెంట్, సైన్సెస్, వ్యవసాయ విభాగాలకు చెందిన మొత్తం 2,789 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు.

ఈసంవత్సరం పట్టభద్రులలో 2,193 మంది బి.టెక్ విద్యార్థులు ఉండగా, 44 మంది పరిశోధకులకు పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేశారు. అదనం గా ఎంబీఏ 155 మంది, ఎంసీఏ 90 మంది, బీఫార్మ్ 88 మంది, బీబీఏ 74 మంది, అలాగే ఫార్మసీ, టెక్నాలజీ, వ్యవసాయం, మేనేజ్మెంట్ రంగాలకు చెందిన పలు పీజీ, డాక్టోరల్ కోర్సుల విద్యార్థులకు కూడా పట్టాలను ప్రదానం చేశారు.

చేనేత రంగంలో తన వినూత్న ఆవిష్కరణతో వేలాది మంది చేనేత కార్మికుల జీవితాల్లో మార్పు తీసుకువచ్చిన ప్రముఖ సామాజిక ఆవిష్కర్త పద్మశ్రీ చింతకింది మల్లేశంకు డాక్టరేట్ ప్రదానం చేసింది. వర్సిటీ చైర్మన్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్నాతకోత్సవానికి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.