భద్రాద్రి రాముడే ఈ కోదండ రాముడు
- దక్షిణ భారత దేశంలోనే కానరాని మూల విరాట్
- సాక్షాత్ రామాయణం తలపించే చిత్రాలు
- అందమైన పుష్కరిణి - కళ కాత్రులతో స్వర్ణ శాల
- శతాబ్ది స్వర్ణోత్సవాలు
- ఆనందింపజేసే ఆలయ చరిత్ర
- నేటి నుండి శతాబ్ది స్వర్ణోత్సవాల కార్యక్రమాలు
గోపాలపేట మార్చ్ 23 : శ్రీ భద్రాద్రి రాముడిని తలపించే విధంగా దివ్యకాంతులతో నెలకొన్న ఈ గోపాలపేట కోదండ రా ముడు భక్తులకు కొంగు బంగారంలా తలపిస్తున్నాడు. ఈ ఎంతో మహోన్నతమైన ఈ కోదండరామస్వామి ఆలయం వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కనే దర్శనమిస్తుంది.
పూర్వం ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగేవి నాడు ఉమ్మడి జిల్లా అయినా మహబూబ్నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలంతా తం డోపతండాలుగా తరలివచ్చి నిలువెత్తు వెలిసిన ఈ కోదండ రామస్వామి కళ్యాణం బ్ర హ్మోత్సవాలను తనివితీరా దర్శించుకునేవారు.
భక్తుల ఆనందోత్సవాలు ...
ఆలయం పరిసర ప్రాంతాలు ఎంతో ఆ హ్లాదకరంగా, అందమైన పుష్కరిని ఆలయంలోపల స్వర్ణశాల అందమైన చిత్రాలు ఏడు అంతస్తుల గాలిగోపురం గాలిగోపురంపై రా మాయణం ఉట్టిపడేలా శిల్పాలు జిల్లాలో ఎ టు కనిపించని వ్రతం వీటన్నిటిని భక్తులు తనివితీరా తిలకిస్తూ ఉంటారు. ఆనందోత్సవాలు పంచుకుంటారు.
ఆలయ చరిత్ర....
పూర్వం సుమారుగా200 ఏళ్ళ కాలం నాటి చరిత్రగోపాల్పేట సంస్థానాన్ని రాజులు పాలించేవారు. గోపాల్ రావు రాజు పాలించే క్రమంలో ఈ గ్రామాన్ని తన పేరు వచ్చేలా గోపాలపేటగా మార్చారు. ఆ క్రమంలోనే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి మాత్రమే ని ర్మించి అక్కడున్న కాలనీని హనుమాన్లగడ్డగా మార్చారు. ఇక్కడ వజ్రాలు రాసులుగా పో సుకొని అమ్ముతుండేవారని పెద్దలు చెప్పుకుంటారు.
కొన్ని ఏళ్ల తర్వాత ఆ రాజు తదనంతరం రాణి రంగనాయకమ్మ సంస్థానాన్ని పాలించేది. ఒకరోజు రాణీ రంగనా యకమ్మకు స్వప్నంలో ఆంజనేయ స్వామి తనతో మాట్లాడినట్లు అనుకుంటుంటారు. తన స్వప్నంలో స్వామివారి వచ్చి నా పక్కనే నా స్వామి అయినా రాములవారి ఆలయం నిర్మించాలని రంగనాయకమ్మకు ఆదేశించినట్లు రాణి రంగనాయకమ్మ ప్రజలకు వెల్లడించినట్లు ప్రజలు చెప్పుకుంటారు.
రాముల వారి ఆలయ నిర్మాణం కోసం ఆదేశాలు..
రాణి రంగనాయకమ్మ శ్రీరాముడి ఆల య నిర్మాణం కోసం వెంటనే పనులు చేపట్టాలని మంత్రులకు ఆదేశాలు ఇచ్చారు. అప్పట్లో ఆలయ నిర్మాణం కోసం మంచి నైపుణ్యం గల కళాకారులను దేశ నలుమూలల వెతికినట్లు చెప్పుకుంటారు. మంచి నైపు ణ్యం గల కళాకారులను రప్పించి సీతారాముడి గర్భగుడిని నిర్మించారు. అంతేకాకుం డా రాముల వారి గర్భగుడి ఎదురుగా అం దమైన గాలిగోపురం నిర్మించాలని రాణి రంగనాయకమ్మ ఆదేశాలు పలికారు.
వెంటనే ఏడంతస్తుల గాలిగోపురం నిర్మాణం చేప ట్టి రామాయణం తలపించే విధంగా కళాకారులు శిల్పాలను చెక్కారు. గాలిగోపురం పూర్తి అయిన తర్వాత పక్కనే జిల్లా నలుమూలల ఎక్కడలేని విధంగా ఉండేలా రథా న్ని తయారు చేయించారు అంతేకాకుండా అందమైన పుష్కరిని ఆలయంలోపల కళాకృతులతో స్వర్ణ శాల వంటివి ఏర్పాటు చేశారు.
శ్రీ సీతారామ లక్ష్మణ హనుమా విగ్రహాలను గర్భగుడిలో ప్రతిష్టించేందుకు దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఉండే శ్రీ సీతా రాముడు లక్ష్మణుడు మూల విగ్రహాలను తెప్పించి అహోబిలం నుంచి ఋషు లను ఈ ఆలయానికి రప్పించి ఈ విగ్రహాలకు గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ట చేశారు. ఆనాటి నుండి ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా సంస్థా నా దిశలైన రాణి రంగనాయకమ్మ జరిపించేవారు. రాణి రంగనాయకమ్మ తదననంత రం ఈ ఆలయం పాలన పాలనకు నోచుకోకుండా పోయింది.
వెలుగులోకి రామాలయం ...
రాణి రంగనాయకమ్మ కాలం ముగిశాక కొంతమంది గ్రామ పెద్దలు చొరవ తీసుకొని ఈ ఆలయం ఎంతో పవిత్రమైనదని శిథిలావస్థకు చేరకూడదని గ్రామ పెద్దలు ఓ వేద పండితుని ఏర్పాటు చేసి ప్రతిరోజు ధూప దీప నైవేద్యం చేయాలని చెప్తూ శిథిలావస్థకు చేరకుండా చూశారు.
శతాబ్ది స్వర్ణోత్సవాలు .....
శ్రీశ్రీశ్రీ కోదండరామ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం నేటికి 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ సీతారామ స్వామి కళ్యాణం సందర్భంగా కోదండ రామస్వామి ఆలయంలో శతాబ్ది స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్న ట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
శతాబ్ది స్వర్ణోత్సవాల కార్యక్ర మాల వివరాలు ...
శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ఈనెల 24న మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ఉత్సవ ఆరంభ విశ్వక్సేన ఆరాధన అంకురార్పణ జరుగుతాయి. 25న బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు ఆలయ ప్రవేశం అగ్ని ప్రతిష్ట మహాయాగం గరుడ ప్రసాదం స్వామివారికి మంగళ స్నానాలు ఉదయం 11 గంటలకు జరుగును అదేవిధంగా 25న బుధవారం సహస్ర కళాశాభిషేకంతో భక్తులంతా గ్రామం నుండి వరుస క్రమంలో భక్తులంతా ఊరేగింపుగా భాజా భజంత్రీలతో ఆలయానికి చేరుకుంటారు తమ ఇంటి నుంచి తీసుకొచ్చిన నీళ్లతో స్వామివారికి పెద్ద ఎత్తున అభిషేకాలు చేస్తారు. 26న గురువారం ఉదయం 9 గంటల నుండి నిత్య ఆరాధన సుదర్శన మహా యజ్ఞం నిత్య పూర్ణాహుతి సాయంత్రం హోమం కుంభాభిషేకం వంటి కార్యక్రమాలు జరుగును.
శ్రీ సీతారామ కళ్యాణం ...
27న శుక్రవారం ఉదయం 9 గంటల నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు 10 గంటల 30 నిమిషాలకు శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సీతారాముల కళ్యాణం ముత్యాల తలంబ్రాలతో కన్నుల పండుగ జరుగును 28న స్వామివారికి పట్టాభిషేక కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాముల వారి పట్టాభిషేకంలో పాల్గొనే ప్రతి భక్తుడికి సీతారాముల వారి డాలర్ కాయిన్ పొందుతారని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా స్వామివారి ఉత్సవాలలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు కోరారు.




