25 March, 2026 | 1:50 AM

నాటారు.. తొలగించారు!

25-03-2026 12:00 AM

మొక్కల పేరుతో మెక్కేశారు..

రూ.7లక్షలు బూడిద పాలు

మళ్ళీ పండ్ల తోటలు అంటూ కొత్త బిల్లులు?

జీవ్విగడ్డలో అధికారుల నిర్లక్ష్యం

ప్రజా ధనం దుర్వినియోగం

మహమ్మదాబాద్, మార్చి 24: గత ప్రభుత్వంలో లక్షల రూపాయలు ఖర్చు చేసి హరితహారం పేరుతో ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం కింద మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోగా, ప్రస్తుతం అధికారు లు మాత్రం నాటిన చెట్లను తొలగించి కొత్త పండ్ల తోటల పేరుతో మొక్కలు నాటేందుకు నిర్ణయించడంపై స్థానికంగా చర్చ నీయాం శం అయింది. ఉన్న చెట్లను తొలగించి కొత్త మొక్కలను నాటడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. 

రూ.ఏడు లక్షలు వృధా..

మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలంలోని జూలపల్లి గ్రామ పరిధిలోని జీవ్విగడ్డ లో గత ప్రభుత్వంలో 2023 సంవత్సరంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం సుమారు మూడు వేల మొక్క లు నాటారు. మొక్కలు నాటి సంరక్షించాల్సిన అధికారులే తమకేమీ పట్టనట్టు వ్యవ హరించడంతో లక్షల రూపాయలు నేల పా లు అయ్యాయి. ఇదిలా ఉండగా గతంలో మొక్కలు నాటిన చోటే అన్నింటిని తొలగించి పండ్ల తోటలు పెడతామంటూ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

పండ్ల తోటలు పెట్టాలంటే ఒక కొత్త ప్రాంతంలో పెట్టాల్సింది పోయి ఉన్న మొక్కలను చెట్లను తొలగించి పండ్ల తోటలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి పేరుతో ఉన్న మొక్కలను తొలగించడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

గతంలో నాటిన మొక్కల లెక్క ఏందని, వాటి ఖర్చుల దుర్వినియోగం ప్రస్తుతం తొలగించిన మొక్కలు చెట్లను ఏం చేసారో తెలుపాలంటున్నారు. వర్కింగ్ కోడ్ 3614066021/DP/7231123709 లో మొక్కలు మాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజాధనం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోకుండా నామమాత్రంగా పనులు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అధికారుల నిర్లక్ష్యంగానే మొక్కల తొలగింపు....

ఫారెస్ట్ లో ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద మొ క్కలు నాటడం జరిగింది. ఆ ప్రాం తంలో గుంతలు ఏర్పాటు చేసి ఆగుం తల్లో నీళ్లు పోసి అక్కడి నుం చి మొక్కలకు కూడా కూలీల ద్వారా అందించాం. ఫీల్ అసిస్టెంట్ బాల్ రెడ్డి నిర్లక్ష్య కారణంగానే కొన్ని మొక్కలకు నీరు అం దకపోవడంతో మరికొన్ని మొక్కలు వే పుగా పెరిగాయి. వాడిని పూర్తిస్థాయిలో తొలగించి మళ్లీ మొక్కలు పెడతామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఉ న్న మొక్కలకు నీళ్లు పోయరు కొత్త మొక్కలు పెడతామంటే వారికి ఎవరు చెబుతారు. 

ఆర్ కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్, జూలపల్లి గ్రామం, మహమ్మాదాబాద్ మండలం 

మొక్కలను నాటి నీరు పోసి పెంచాం.. మొత్తం కూలీ రాలే..

రెండు, మూడు ఏళ్ల క్రితం ఫారెస్ట్ లోనే జీవిగడ్డ దగ్గర అక్కడ మేము పనిచేశాం. మొక్కలు నాటి గుం తల్లో ఉన్న నీరును తీసుకొని మొక్కలకు పోశం. మొక్కలకు నీరు కూడా పోసి పెంచాం. ఇప్పటివరకు మా కూలి ఇంకా రాలేదు. 

చౌల సత్యమ్మ, గొల్ల అంజిలమ్మ ఉపాధి హామీ కూలీలు, జూలపల్లి గ్రామం,

విలువైన మొక్కలను నాటుతున్నాం...

 గతంలో మొక్కలు నాటిన వి షయం వాస్తవమే. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు కొన్ని ప్రాంతాలలో మొక్కలు పూర్తిస్థాయిలో చిగురించకపోవడంతో వాటిని పూర్తిస్థాయిలో తొల గించి కాల్చి వేయడం జరిగింది. ఈ వ ర్షాకాలంలో జీడిపప్పు, బాదం, మామి డి ఉసిరి చింత తో పాటు విలువైన మొ క్కలను నాటేందుకు అవసరమైన చర్య లు తీసుకుంటున్నాం. 

      రాఘవేందర్, ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, మహమ్మాదాబాద్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా