25 April, 2026 | 3:55 AM

ప్రభుత్వ అవకాశాలను యువత సద్వినియోగం చెసుకోవాలి

25-04-2026 02:00 AM

షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్‌నగర్ ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ప్రభుత్వం కల్పిస్తున్నా అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ప్రతి నియోజక వర్గంలో ATC సెంటర్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, పాలిటెక్నిక్ కాలేజీలను అందుబాటులోకి తీసుకురావడం జరిగినదని తెలిపారు.  ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లోని  సంక్షేమ వారోత్సవాలలో భాగంగా శుక్రవారం షాద్నగర్ మండలం, ఫరూఖ్ నగర్ ఎం పి డి ఓ కార్యాలయ ప్రాంగణంలో 5వ రోజు జిల్లా స్థాయి నైపుణ్యాభివృద్ధి అవగాహన కార్యక్రమం నిర్వాహించారు.. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) కె.శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వాహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు ఉన్నతస్థాయి చదువులు చదివిన కూడా సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి నాటి నుండి నేటి వరకు అనేక మార్పులు తీసుకొని వచ్చి నైపుణ్యన్ని మెరుగుపర్చడం జరుగుచున్నది.  ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమాలపై యువతకు, మహిళలకు అవగాహన కల్పించాలని అన్నారు. అదనపు కలెక్టర్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు మరియు ఉపాధి కల్పించే శిక్షణా అవకాశాలపై అవగాహన కల్పించడానికి, నిరుద్యోగ యువత, ఐటిఐ, ఎటిసి డిప్లొమా, జూనియర్ కళాశాల, డిగ్రీ, పిజి మరియు వృత్తి విద్యా కళాశాలల విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యన్ని మెరుగుపరచడానికి శిక్షణ ఇవ్వడానికి ATC కేంద్రాలను అందుబాటులోకి  తీసుకురావడం జరుగుతుందని.

పదవ తరగతి, ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు ఈ నైపుణ్య కోర్సులు, శిక్షణా కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలని, ఊన్నతస్థాయికి చేరుకోవాలని తెలిపారు.   షాద్ నగర్ మున్సిపల్ ఛైర్మన్ అగ్గనూరి బస్వమ్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బాబర్, సంక్షేమ శాఖలకు చెందిన జిల్లా అధికారులు డిడి, బిసి సంక్షేమం కేషు రామ్, డిడి ఎస్సి సంక్షేమం, డిఎమ్డబ్ల్యూఓ నవీన్ కుమార్ రెడ్డి, డిటిడిఓ రామేశ్వరి దేవి, ఇడి ఎస్సి కార్పొరేషన్ పద్మావతి, జిఎమ్ డిఐసి శ్రీలక్ష్మి, డిఇఓ సుసిందర్ రావు వివిధ సంబంధితశాఖల అధికారులు పాల్గొన్నారు.