రాకమచర్ల వెంకటదాసు జీవితం సాహిత్య అధ్యాయ సమర్పణ
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, హరి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిచే ఆవిష్కరణ
చేవెళ్ల/నవాబ్ పేట్ ఏప్రిల్ 24 (విజయ క్రాంతి): తన అద్భుత భక్తి సంకీర్తనలతో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రభావితం చేసి గొప్ప సంకీర్తన కారుడిగా శ్రీశ్రీశ్రీ రాకమచర్ల వెంకట దాసు జీవితం సాహిత్యం పై తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక జాతీయ సదస్సు రవీంద్రభారతిలో నిర్వహించునునట్లు ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సులో లబ్ద ప్రతిష్టులైన సాహితీవేత్తలు పాల్గొని రాకమచర్ల వెంకట దాసు జీవితం సాహిత్యంపై అధ్యయనం చేసిన పత్రాలను సమర్పించనున్నారు.
సంకలన సారాంశంను తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరింప చేస్తారని పేర్కొన్నారు. ఉదయం 8:30 కు రాకమచర్ల వెంకటదాసు సంకీర్తనలతో ప్రారంభమై తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి సభ ముఖ్య అతిథులుగా తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఎన్ బాలాచారి నిర్వహణలో ప్రారంబించునున్నారు. ఈ కార్యమానికి ముఖ్య అతిధులుగా పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి రానున్నారు.
సంచిక ఆవిష్కృత కార్యక్రమం సాయంత్రం వరకు కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుత రాకమచర్ల పీఠాధిపతి వెంకట దాచార్యులు పాల్గొంటున్నారు. వికారాబాద్ తాండూర్ పరిగి శంకరపల్లి చేవెళ్ల పరిసర ప్రాంతాల నుంచి కూడా కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. వికారాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి కవులు కళాకారులు భజనపరులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా అనంత సాహితీ సాంస్కృతిక అధ్యక్షులు ఆశీర్వాదం ప్రధాన కార్యదర్శి కమలేష్‌ఒక ప్రకటనలో తెలియజేశారు.






