ఇరాన్‌పై యుద్ధం మొదలైంది!
- అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ క్షిపణి దాడులు
- పలు నగరాల్లో విస్ఫోటనాలు.. 2౦౦ మంది దుర్మణం
స్కూల్‌పై పడిన క్షిపణులు.. 85 మంది పిల్లలు మృతి
దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్, రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ పక్బూర్ మృతి
ఇరాన్ సుప్రీం ఖమేనీనే ఇజ్రాయెల్ అసలు టార్గెట్.. అప్పటికే ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించిన టెహ్రాన్ సైన్యం
దాడులకు ప్రతిగా 8 దేశాలపై ఇరాన్ దాడులు
గల్ఫ్ దేశాల్లోని భారతీయులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని భారత్ మార్గదర్శకాలు
* యుద్ధం మొదలైంది.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు ప్రారం భించాయి. మొదటగా ఇరాన్‌లోని ఐదు నగరాలపై క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు కొద్ది దూరంలోని ఓ పాఠశాలపై జరిగిన బాంబు దాడిలో 85 మంది విద్యార్థులు మరణించారు. అణ్వాయుధ పరీక్షలపై ఏమాత్రం వెనక్కి తగ్గేదిలేదని ఇరాన్ తెగేసి చెప్పడంతో, ఇరాన్- ఇజ్రాయెల్‌కు మధ్య ఒమన్ మధ్యవర్తిత్వం విఫలమైంది.
చర్చలు విఫల మైన కొద్ది గంటలకే.. శనివారం తెల్లవారుజామున ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణులు ప్రయో గించింది. ఇరాన్ సుప్రీం ఖమేనీ టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులు చేసినప్పటికీ, ఆయనను సైన్యం బంకర్‌కు తరలించినట్లు తెలిసింది. గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తల నేపథ్యంలో ఆయా దేశాల్లో ని భారతీయులు, భారత సంతతి ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని, అత్యవ సర సమయాల్లో భారత రాయబార కార్యాలయాలను సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది.
- మిత్ర దేశం ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా వార్
- పలు నగరాలపైకి క్షిపణుల ప్రయోగం
భారీ విస్ఫోటనాలు.. మొత్తంగా 2౦౦ మంది మృతి.. బాలికల పాఠశాలలపై దాడిలో ౮౫ మంది మృత్యువాత
దాడుల్లో ఆ దేశ రక్షణ మంత్రి అమీర్, రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ పక్బూర్ మృతి
ఇరాన్ సుప్రీం ఖమేనీనే ఇజ్రాయెల్ అసలు టార్గెట్
అప్పటికే.. ఆయన్ను సురక్షిత ప్రాంతానికి తరలించిన సైన్యం
దాడులకు ప్రతిగా 8 దేశాలపై ఇరాన్ దాడులు.. సైనిక స్థావరాల పేల్చివేత
- లొంగిపోండి.. లేదంటే మరణమే శరణ్యం: అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- ఇరాన్‌పై దాడి అంతర్జాతీయ చట్టాల విరుద్ధం: విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్
టెహ్రాన్/ టెల్‌అవీవ్, ఫిబ్రవరి ౨౮: ఇరాన్‌పై అమెరికా యుద్ధం మొదలైంది. అగ్రరాజ్యం తన మిత్రదేశమైన ఇజ్రాయెల్‌తో కలిసి శనివారం తెల్లవారుజామున టెహ్రాన్, ఇస్ఫహాన్, కోం, కరాజ్, కెర్మాన్షా వంటి నగరా లను టార్గెట్ చేస్తూ క్షిపణులను ప్రయోగించింది. దాడుల్లో మొత్తంగా 2౦౦ మంది మృతిచెందారు. ఇరాన్ రక్షణశాఖ మంత్రి అమీర్ నాసిర్దారే, రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ పక్పూర్ మృతిచెందారు.
అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందానికి ససేమిరా అన్న కొన్ని గంటల తర్వాత దాడులు జరగడం గమనార్హం. దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా ఎనిమిది దేశాలపై దాడులు చేసింది. ఒకేసారి ఇజ్రాయెల్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, అబుదాబి, ఖతార్, జోర్డా న్, యూఏఈపై దాడులు చేసింది. ముఖ్యం గా బహ్రెయిన్‌లోని అమెరికన్ సైనిక స్థావరాలపై దాడి చేయడం గమనార్హం. ఇజ్రా యెల్ దాడుల వెనుక అమెరికా ఉం డి అన్నీ తానై నడిపిస్తున్నది.
ఈ దాడులను ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్జ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ నివాసం, నిఘా ప్రధాన కార్యాలయం సహా మొత్తం 30 ప్రాంతాలు లక్ష్యంగా ఈ దాడు లు జరిగాయి. దాడుల నేపథ్యంలో ఇరాన్ సైన్యం తమ దేశ ప్రజలను అప్రమత్తం చేసింది.
వైమానిక దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించింది. పరస్పర దాడుల నేపథ్యంలో ఇరాన్, ఇజ్రా యెల్ తమ గగనతలాలను మూసివేశాయి. అమెరికా తమ సైనిక చర్యను ‘ఆపరే షన్ ఎపిక్ ఫ్యూరీ’ అని, ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ అని ప్రకటించింది.
ఖమేనీ కార్యాలయం సమీపంలో దాడులు
ఇజ్రాయెల్ మొదటి దాడి ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని 30 ప్రాంతాల్లో ఒకేసారి జరిగాయి. దీనిలో భాగంగా మొదటి దాడి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కార్యాలయం సమీపంలోనే జరిగింది. అయితే, ఆ సమయంలో ఖమేనీ టెహ్రాన్ లేరని, సైన్యం అప్పటికే ఆయన్ను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి.
అమె రికా,ఇజ్రాయెల్ దాడులు ఖాయమని భావి ంచిన సైన్యం ముందుగానే ఖమేనీని నగరం దాటించినట్లు తెలిసింది. హార్మోజ్‌గాన్ ప్రావిన్స్ మినాబ్ నగరంలోని ఓ బాలికల పాఠశాలపై జరిగిన వైమానిక దాడిలో ౮౫ మంది మృతిచెందారని, మరో ౪౫ మంది క్షతగాత్రులైనట్లు స్థానిక మీడియా వెల్లడించి ంది. దాడి సమయంలో స్కూల్లో 170 మం ది విద్యార్థినులు ఉన్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
ఇరాన్ ప్రతీకార దాడులు
ఇజ్రాయెల్, అమెరికా క్షిపణి దాడులు ప్రారంభించిన తర్వాత ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు పూనుకున్నది. ఉత్తర ఇజ్రా యెల్ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ 35కి పైగా బాలిస్టిక్ క్షిపణలను టార్గెట్ చేసింది. ‘యుద్ధం మీరు ప్రారంభించారు. ఊహించని రీతిలో యుద్ధానికి ముగింపు మేం ఇ స్తాం’ అనే అధికారిక ప్రకటనతో దాడులను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగానే.. ఒకేసారి ఇజ్రాయెల్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, అబుదాబి, ఖతార్, జోర్డాన్, యూఏఈపై దాడులు చేసింది.
తమ దేశంలోని అమెరికా నేవీ 5వ ఫ్లీపై క్షిపణి దాడి జరిగినట్లు బహ్రెయిన్ ప్రభుత్వం సైతం ధ్రువీకరించింది. అబుదాబి సమీపంలోని అల్ దఫ్రా సైనిక స్థావరంపైనా ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. దాడుల్లో అబుదాబికి చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. జోర్డాన్ సరిహద్దుల్లోకి దూసుకువస్తున్న రెండు బాలిస్టిక్ క్షిపణులను అక్కడి సైన్యం కూల్చివేసింది. మరోవైపు ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ రెబల్స్ కూడా యుద్ధ రంగంలోకి దిగారు. ఎర్ర సముద్రంలో వెళ్లే ఓడ ల పై మళ్లీ దాడులు చేస్తామని ప్రకటించారు.
ఇరాన్‌పై దాడులను ఖండించిన రష్యా
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న దాడులను రష్యా ఖండించింది. ఆ రెండు దేశాలూ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించాయని ఆరోపించింది. రెండు దేశాధినేతలు ముందస్తు ప్రణాళికతోనే దా డులకు పాల్పడ్డాయని పేర్కొంది. మరోవైపు, ఆయా దేశాల్లో శాంతి నెలకొనాలని ఖతార్, సౌదీ అరేబియా దేశాలు ఆకాంక్షించాయి. దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని అభిప్రాయపడ్డాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్య ంలో దుబాయ్ నుంచి విమాన సర్వీసులు నిలిచిపోయాయి. తదుపరి నోటీసులు జారీ చేసేవరకు దుబాయ్, అల్ మక్తు మ్ అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఆ యా దేశాల ప్రభుత్వాలు ప్రకటించాయి. బ్రిటన్ ప్రధానమంత్రి కైర్ స్టార్మర్ ఈ అత్యవసర పరిస్థితిపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఉద్రిక్తతలు తగ్గించాలని ఆయన ఇరు దేశాలను కోరారు. యూరోపియన్ యూనియన్ కూడా పౌరుల రక్షణే తమ ప్రాధాన్యతని స్పష్టం చేసింది.
అణు కేంద్రాల భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని సూచిం చింది. భారతదేశంలో కూడా ఈ పరిణామాలపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. మధ్యప్రాచ్యంలో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ప్రతిపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
విమాన సర్వీసులు రద్దు
ఇజ్రాయెల్, ఇరాన్ తమ గగనతలాలను మూసివేయడంతో శనివారం ఢిల్లీ నుంచి ఇజ్రాయెల్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానం వెనక్కి తిరిగివచ్చింది. పశ్చిమాసియాకు వెళ్లే విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. మరో దేశీయ విమానయాన సంస్థ ఇండిగో కూడా పశ్చిమాసియా దేశాలకు విమానాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ప్రవాస భారతీయులకు భారత ప్రభుత్వం మార్గదర్శకాలు
ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ శనివారం భద్రతాపరమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
ఇరాన్ సైన్యం లొంగకుంటే.. మరణమే శరణ్యం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఇరాన్‌పై జరుగుతున్న దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్ తన అణ్వాయుధ వ్యవస్థను తిరిగి నిర్మించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని, ఆ చర్యలను అడ్డుకునేందుకే అమెరికా,-ఇజ్రాయెల్ కలిసి ఆ దేశంపై దాడులు చేస్తున్నామని వెల్లడించారు. ఇరాన్ సైన్యం బేషరతుగా తమ ఆయుధాలను వదిలి లొంగిపోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు జారీచేశారు. అమెరికన్ ప్రజలు, సైనికులతోపాటు తమ మిత్రదేశాలకు ఇరాన్ నుంచి ఎదురవుతున్న ము ప్పును తొలగించడమే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు.
మా దేశంపై దాడి అంతర్జాతీయ చట్టాల విరుద్ధం: ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ కుట్ర పన్ని తమ దేశంపై దాడులు చేయిస్తున్నారని ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మండిపడ్డారు. ఆ దాడులు అంతర్జాతీయ చట్టాల విరుద్ధమైనవని తెలిపారు. ‘అమెరికా ఫస్ట్’ నినాదాన్ని ట్రంప్.. ‘ఇజ్రాయెల్ ఫస్ట్’గా మార్చారని ఆయన విమర్శించారు. దురాక్రమణదారులకు ఇరాన్ సాయుధ బలగాలు సరైన గుణపాఠం చెబుతాయని ఈ సందర్భంగా హెచ్చరించారు.




