అక్రమ నిర్మాణాల ఇష్టారాజ్యం
ఓసీ జారీ అవ్వడంతో అక్రమంగా అదనపు అంతస్తు
ప్రేక్షక పాత్రకే పరిమితమైన పట్టణ ప్రణాళిక అధికారులు
కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి ఎవరు చూడలేదనుకొనే చందంగా తయారయ్యింది నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని అక్రమ నిర్మాణదారుల తీరు. ఓ వైపు అక్రమ నిర్మాణాలపై చర్యలంటూనే అధికారులు చర్యలు తీసుకుంటున్న అక్రమ నిర్మాణాలు మాత్రం క్షేత్ర స్థాయిలో ఆగడం లేదు. ఈ ఉదాంతం అధికారుల కనుసన్నలోనే కొనసాగుతున్నట్లు స్థానికులలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అందుకు తగ్గట్టుగానే సర్కిల్ పరిధిలో ఓ అక్రమ నిర్మాణదారుని అతి తెలివి చుస్తే స్పష్టమవుతుందని స్థానికుల నుండి అభిప్రాయం వెలువెత్తుతుంది. ఎలా నిర్మిస్తే మాకెవ్వడు అడ్డు అనేలా విర్ర వీగుతూ ఎడాపెడా అక్రమ నిర్మాణాలకు ఆజ్యం పోస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.నిజాంపేట్ సర్కిల్ బండారి లే అవుట్ డివిజన్ పరిధిలోని ఓ బిల్డర్ హెచ్ ఎం డి ఎ అనుమతులు తీసుకొని నిర్మాణం పూర్తి చేశాడు. అయితే ఈ భవంతులను హెచ్‌ఎండీఏ అప్రూవల్ ప్లాన్ ప్రకారం కాకుండా ప్లాన్ వైలెట్ చేస్తూ అదనపు అక్ర మ ఫ్లోర్ నిర్మా ణం చేపట్టాడు.
హెచ్‌ఎండీఏ అధికారుల నుండి ఓసి, మార్టిగేజ్‌లు రిలీజ్ అయ్యాక గుట్టుచప్పుడు కాకుండా దొంగ చాటుగా మరో అదనపు అంతస్థు నిర్మాణం చేపట్టేందుకు కుయుక్తులు పన్నాడు. అయితే ఈ అక్రమ నిర్మాణానికి టౌన్ ప్లానింగ్ అధికారులే పరోక్షంగా సహకరిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు రోజుకో చోట జరుగుతున్నా అడ్డుకోవడంలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది విఫలమవుతున్నారు. అనుమతులకు విరుద్ధంగా నిర్మిస్తు న్న అక్రమ అదనపు అంతస్తు నిర్మాణంపై చర్యలు తీసుకొని, బిల్డర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
నోటీసులు జారీ చేశాం: ఏసీపీ ప్రసీద
సదరు అక్రమ నిర్మాణం పై నిజాంపేట్ సర్కిల్ ఏసీపీ ప్రసీద ని వివరణ కోరగా నోటీసులు జారీ చేశామని తెలిపారు. నోటీసుల సమయం గడిచాక చర్యలు తీసుకుంటామని అన్నారు.






