రాకాస రైట్స్ వాళ్లకే..
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల నిర్మిస్తున్న తాజాచిత్రం ‘రాకాస’. జీ స్టూడియోస్ ఉమేశ్ కుమార్ బన్సాల్ సమర్పణలో రూపుదిద్దుకుంటోందీ సినిమా. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జోడీగా నయన్ సారిక కనిపించనుంది. మానస శర్మ కథను అందించటంతోపాటు దర్శకత్వం వహించారు.
ప్రేమ, హాస్యం, ఫాంటసీ అంశాలు కలగలిపిన కథతో రూపొందిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను ముఖ్యపాత్రలు పోషించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాపై మొదట్నుంచీ బజ్ ఏర్పడింది. రిలీజ్‌కు ముందే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ బిజినెస్ డీల్ తాజాగా జరగ టంతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఈ సినిమా థియేట్రిల్ రైట్స్‌ను శ్రీలక్ష్మి నరసింహ మూవీ మేకర్స్ సొంతం చేసుకున్నారు.
దీంతో మేకర్స్ ఓవర్సీస్‌లోనూ భారీ స్థాయిలో రిలీజ్‌కు సన్నాహాలు చేస్తు న్నారు. అథర్వణ భద్రకాళి పిక్చర్స్ ఈ సినిమా అంతర్జాతీయ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను నిర్వహిస్తోంది. ఈ సంస్థ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, యూరప్, కెనడా, ఆస్ట్రేలియా వంటి కీలక ప్రాంతాల్లో కలిపి 350కు పైగా అంతర్జాతీయ స్క్రీన్లలో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేసింది. ముఖ్యంగా నార్త్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ మార్కెట్లలో డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను ప్రత్యంగిరా సినిమాస్ చేపట్టింది. విదేశీ ప్రేక్షకుల కోసం ప్రీమియర్ షోలు 2026 ఏప్రిల్ 2న ప్రదర్శించనున్నారు. ఆ తర్వాతి రోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతాన్ని సమకూరుస్తుండగా, రాజు ఎదురోలు సినిమాటోగ్రపీ అందిస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.




