28 March, 2026 | 6:26 PM

Breaking News

గర్భిణీ స్త్రీలు బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి   •   ఆశా కార్యకర్తల అరెస్టు తగదు   •   తిరుమలగిరి జడ్‌పిహెచ్‌ఎస్‌లో ఎస్సెస్సీ పరీక్ష కేంద్రం తనిఖీ చేసిన ఎంఆర్వో   •   జాతీయస్థాయిలో జిల్లా కలెక్టర్ నిర్మల్ దక్కిన గౌరవం   •   ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్   •   వికలాంగులకు 6 వేల పెన్షన్ హామీ ఏమైంది....?   •   మైనర్లతో కౌన్సిలర్ కొడుకు అసభ్యకర వీడియోలు..100 మందికి పైనే బాధితులు   •   దేవాదాయ శాఖను అభినందించిన మంత్రి తుమ్మల   •   మామునూరు టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించిన బండారు నరసింహారావు   •   ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కవిత   •  

గిరిజన, బంజారా నాయకుల ముందస్తు అరెస్టులు హేయమైన చర్య

26-03-2026 12:05 AM

కోటియా నాయక్

కోదాడ, మార్చి 25 : గిరిజన, బంజారా నాయకుల ముందస్తు అరెస్టులు హేయమైన చర్య అని లంబాడి హక్కుల పోరాట సమితి , ఎల్ హెచ్ పి ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి భూక్యా కోట్యా నాయక్ విమర్శించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖలో పెండింగ్లో ఉన్న సబ్సిడీ నిధుల విడుడలకు హైదరాబాద్ లోని గిరిజన సంక్షేమ భవన్ ముట్టడికి  పిలుపునిచ్చిన గిరిజన సంఘాల జేఏసీ నాయకుల అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీల ప్రకారం అనేక సంక్షేమ పథకాలను మాకు చేరే విధంగా చర్య తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ లో సేవాలాల్ మహారాజ్ విగ్రహావిష్కరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.  జిల్లా నాయకులు భూక్యా రవినాయక్ ను ముందస్తు అరెస్టు చేసి కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంచడాన్ని ఖండించారు.