26 April, 2026 | 10:47 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

జిల్లాలో మోడల్ కోడ్ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఉంటుంది

30-09-2025 04:36 PM

రాజకీయ నాయకులతో సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష..

పెద్దపల్లి (విజయక్రాంతి): జిల్లాలో మోడల్ కోడ్ పంచాయితీ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు ఉంటుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీ నాయకులతో కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు మాడల్ కోడ్ అమలులో ఉంటుందని, ఫేజ్-2 , ఫేజ్-3 లో మాత్రమే ఎన్నికలు జరుగుతాయని, ఫేజ్ -1 లో ఎన్నికలు జరగవని, అభ్యర్థులు ఏమైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటే సంబంధిత ఆర్డీవోల దగ్గర అనుమతి పొందాలని, ఏమైనా సమస్యలు ఉంటే మండల స్థాయిలో ఎం.పీ.డీ.వో.లను, జిల్లాస్థాయిలో జడ్పీ.సీ.ఈ.ఓ, డి.పి.ఓ.లను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జె.డ్పి సీ.ఈ.ఓ. నరేందర్, డి.పి.ఓ. వీర బుచ్చయ్య, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.