ఇచ్చిన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి
- లేకుంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం
- ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్‌రెడ్డి
హైదరాబాద్, మే 28(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు జూన్ 2వ తేదీ రాష్ట్ర అవతరణ దినో త్సవాల సందర్భంగా వేతన సవరణ ప్రకటన, హెల్త్ కార్డులు, కోటి రూపాయల ప్ర మాద బీమా పథకాలను అమలుపరుస్తూ ప్రకటించకపోతే ఉద్యోగుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి పేర్కొన్నారు. పీఆర్‌టీయూటీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురు వారం హైదరాబాద్‌లోని సంఘ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీపాల్‌రెడ్డి మా ట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉద్యో గ, ఉపాధ్యాయులకు సంబంధించి ఎన్నో హామీలను పొందుపరచిందని, కానీ రెండున్నర సంవత్సరాలుగా అమలుకు మాత్రం నోచుకోవడంలేదని తెలిపారు. ఇటీవల ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయు ల జేఏసీతో సమావేశం నిర్వహించిన వేతన సవరణ, హెల్త్‌కార్డులు జూన్ 2 నుంచి అమలుచేస్తామని మాట ఇచ్చారని, అదేవిధంగా ఉద్యోగ విరమణ పొందినవారికి రా వలసిన బకాయిలను 100 రోజుల్లో చెల్లిస్తామని హా మీ ఇచ్చారని గుర్తు చేశారు.
ఈ హా మీలన్నీ నిలబెట్టుకోకపోతే పీఆర్‌టీయూటీఎస్ తరఫున ఉద్యమ కార్యాచరణ ప్రకటి స్తామని ప్ర భుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ రాబోయే స భ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవం తం చేయాలని, సంఘ నిర్మాణంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా ముఖ్యమైందని అన్నారు. ప్రస్తుతం 72 వేల సభ్య త్వంతో రా ష్ట్రంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ సంఘంగా పీఆర్‌టీయూటీఎస్ ఉందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర సంఘ ప్ర ధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు పి.వెంకటరెడ్డి, గుండు లక్ష్మణ్, పత్రిక ప్రధాన సంపాదకులు జగన్‌మోహన్ గుప్త, ఆడిట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






