29 May, 2026 | 4:22 AM

కిడ్నాప్ ముఠా అరెస్టు

29-05-2026 12:00 AM
  1. కామారెడ్డిలో తుపాకీతో వ్యాపారవేత్త కిడ్నాప్‌నకు స్కెచ్!
  2. ఆరుగురిని అరెస్ట్ చేసిన తాడ్వాయి పోలీసులు

కామారెడ్డి, మే 28 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి అప్పును ఎగ్గొట్టేందుకు ప్రయత్నించిన ము ఠాను తాడ్వాయి పోలీసులు కృష్ణాజివాడి గ్రామ శివారులో అరెస్టు చేశారు. ఎస్పీ రాజే ష్ చంద్ర గురువారం పోలీస్ కార్యాలయం లో వివరాలను వెల్లడించారు. బుధవారం తాడ్వాయి మండలం కృష్ణాజీవాడి గ్రామ శివాలయం సమీపంలో కొందరు అనుమానితులు ఏదో నేరం చేసేందుకు పన్నాగం వేస్తున్నారని విశ్వసనీయ సమాచారం రావడంతో.. తాడ్వాయి ఎస్‌ఐ తన సిబ్బందితో కలిసి అక్కడకు వెళ్లారు.

వారిని చూసి పారిపోతున్న నిందితునలు పోలీసులు వెంబడిం చి అదుపులోకి తీసుకున్నారు. అయితే కా మారెడ్డికి చెందిన భూస శ్రీనివాస్ అనే వ్యాపారవేత్తకు నిందితులైన నిట్టు నర్సింగారావు, వడ్డే స్వామి, పులి ప్రశాంత్‌గౌడ్, సూరం స్వామిలతో గతం నుంచి పరిచయం ఉన్నట్లు తెలిపారు. వీరి మధ్య గతంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయి. భూస శ్రీనివాస్ వద్ద పెద్ద మొత్తంలో నగదు ఉందని భావించిన నిందితులు, పాత ఆర్థిక బాకీలు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టవచ్చని దురుద్దేశంతో ఆ యనను కిడ్నాప్ చేయాలని పథకం రచించారు.

మహారాష్ట్రలో అక్రమంగా తుపాకు లు లభిస్తాయని వారికి పరిచయం  ఉన్న అజయ్, వైభవ్ అనే వ్యక్తులను సంప్రదించారు. వారు నయ్గావ్‌కు చెందిన మారుతి గోకే అనే వ్యక్తి ద్వారా తుపాకీ కొనవచ్చని చెప్పారు. నిందితులు తాడువాయి మండ లం చిట్యాల గ్రామానికి చెందిన నర్సింగరా వు, ఒడ్డే స్వామి కలిసి ఈ నెల 12న మహారాష్ట్రకు వెళ్లి అజయ్, హన్మంత రావ్ గోంగ పాలే, వైభవ్ ప్రకాశ్ బరాడేవర్ సహకారంతో మారుతి ఘోకేను కలిసి తుపాకీ కొ న్నారు. అందుకు రూ.30 వేలకు ఒప్పందం కుదుర్చుకుని, అడ్వాన్స్‌గా రూ.27 వేలు చెల్లించారు. ఈ నెల 27న మారుతి ఘోకే వారికి తుపాకీని వైభవ్ ప్రకాశ్ బరాడేవర్, అజయ్ హన్మంత రావ్ గోంగపాలే ద్వారా కృష్ణాజివాడ గ్రామ సమీపంలో ఇచ్చేందుకు ప్రయత్నించారు.

ఆ సమయంలో పోలీసు లు నిందితులను అదుపులోకి తీసుకున్నా రు. వారి నుంచి తుపాకీ, రబ్బర్ బుల్లెట్లు- 5, ఎయిర్ రైఫిల్ పెల్లెట్ బాక్సులు -2, ఫోన్లు -5, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. పట్టుబడిన వారిలో నిట్టు నర్సింగారావు,  సూర స్వామి అలియాస్ వడ్డె స్వా మి, పులి ప్రశాంత్‌గౌడ్, సురం స్వామి, వైభవ్ ప్రకాశ్ బరాడేవర్, కోకెల్ గావ్‌కు చెందిన అజయ్ హనుమంతరావు గోంగపాలె ఉన్నారు. మరో నిందితుడు మారుతి ఘోకే పరారీలో ఉన్నట్లు తెలిపారు.