ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్‌ది ప్రభుత్వ హత్యే
టీయూజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రామ్‌రెడ్డి
ముషీరాబాద్, ఏప్రిల్ 24(విజయక్రాంతి): వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ సెంటర్ లో సీనియర్ ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ తన వంటి మీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని తెలంగాణ ఉద్యమ కారు ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆరోపించింది. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం వహించిన నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన జరిగిందని తెలంగాణ ఉద్యమకారుల సంఘం జేఏసీ చైర్మన్ తుమ్మల ప్రఫుల్ రామ్ రెడ్డి శుక్రవా రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ కోసం గత కొంత కాలంగా పోరాడుతూనే ఉన్నారన్నారు. రాష్ట్ర బంద్ కు పిలుపు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం సరిగా స్పందించ లేదన్నారు. కాబట్టే తమ హక్కుల కోసం ప్రాణ త్యా గానికైనా ఆర్టీసీ కా ర్మికులు సిద్ధపడ్డారన్నారు. మరిన్ని ఆత్మహత్యలు జరగక ముందే ప్రభు త్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలన్నా రు.
మృతి చెందిన శంకర్ గౌడ్ కుటుంబానికి రెండు కోట్ల ఎక్స్ గ్రేసియా, కుటుం బంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాం డ్ చేశారు. శనివారం నర్సంపేటలో తలపెట్టిన బంద్ కార్యక్రమంలో తెలంగాణ ఉద్య మ శ్రేణులు పాల్గొనాలని కోరారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన పోరాటంలో టీయూ జేఏసీ భాగస్వామ్యం అవుతుందని, ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కారమయ్యే వారి వెంట నడుస్తుందన్నారు.






