చిల్లర్, బ్రోకర్, లోఫర్లకు కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెబుతుంది
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మండిపాటు
ఖానాపూర్ (విజయక్రాంతి) భారతీయ జనతా పార్టీ నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం లో రైతుగోస బిజెపి భరోసా కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో ఖానాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి బీఆర్‌ఎస్ నాయకులు చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు.
ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ లో ఉన్న ఒక నాయకుడు తనను విమర్శిస్తూ రైతులను విడిచి తాను కేరళ టూర్ లో గడుపుతున్నట్లు నిరాదార ఆరోపణలు చేస్తున్నా రని అలాంటి లోఫర్, బ్రోకర్, చిల్లర గాళ్లకు తాను సమాధానం ఇవ్వాల్సిన పనిలేదని, గత ప్రభుత్వంలో ఆ వ్యక్తి ఎన్ని చిల్లర పను లు చేశాడో ప్రజలందరికీ తెలుసునని ప్రస్తుతం స్థానికులు కాకుండా వేరే జిల్లా, గంగా అవతలి నుంచి వచ్చిన ఒక వ్యక్తి వెంబడి తిరుగుతూ ఎన్ని అరాచకాలు చేస్తున్నారో తెలుసునని ,స్థానికంగా ఉంటూ నిరంతరం ప్రజల్లో ఉండి వారి సమస్యలు తెలుసుకుంటున్న తనను విమర్శించడం సిగ్గులేనితనమని తీవ్రంగా విమర్శించారు.
తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు తన కుటుంబంతో కూడా ఎక్కడికి వెళ్లలేదని కేవలం దైవదర్శనానికి మాత్రమే వెళ్లానని, అలాంటిది తనను విమర్శిస్తే మా కార్యకర్తలు త్వరలో ఆ వ్యక్తికి బుద్ధి చెప్తారని దుయ్యబట్టారు. సుమారు 15 నిమిషాలు పేరు చెప్పని ఆ వ్యక్తిని ఎమ్మెల్యే విమర్శించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంసమైంది. ఆ వీడియో స్థానిక వాట్సాప్, ఫేస్బుక్, సోషల్ మీడియాలో, వైరల్ అవుతుంది. ఇకమీదట తమని విమర్శించేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని తాము కూడా తగిన బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉంటాయని అన్నారు.






