21 April, 2026 | 5:38 PM

Breaking News

బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   అకాల వర్షం ఈదురుగాలతో విద్యుత్ శాఖకు నష్టం   •   బస్సు ఢీకొని వ్యక్తి మృతి   •   గోవులను నదులతో సమానంగా గౌరవించాలి   •   విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలి - కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   కొడుకుతో కలిసి కట్టుకున్నోడినే కడతేర్చిన భార్య   •   రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •  

సీఎం దావోస్ పర్యటనకు గ్రీన్ సిగ్నల్

18-12-2025 12:49 AM

ఏసీబీ కోర్టు అనుమతులు

హైదరాబాద్, డిసెంబర్ 17(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. రూ.10 వేల పూచికత్తుతో పాస్‌పోర్టు ఇచ్చేందుకు అనుమతించింది. అయితే మార్చి 3 లోగా పాస్‌పోర్టు తిరిగి అప్పగించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. జనవరి 19 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్ జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారు. ఈ పర్యటనకు ఏసీబీ స్పెషల్ కోర్టు అనుమతి ఇచ్చింది.

2015లో ఓటుకు నోటు కేసులో బెయిల్ షరతుల మేరకు కోర్టు అనుమతిని సీఎం రేవంత్‌రెడ్డి పాస్‌పోర్టు కోర్టు కస్టడీలో ఉంది. కాగా రేవంత్‌రెడ్డి విదేశాల్లో పర్యటించేందుకు ఏసీబీ కోర్టు అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే రూ.10వేల పూచికత్తుతో పాస్‌పోర్టు ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. దావోస్ సదస్సులో తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు మఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి ప్రతినిధి బృందంతో కలిసివెళ్తారు.