సంయుక్త నే రామ్ హీరోయిన్!
వరుస అవకాశాలు, విభిన్న పాత్రలతో అరిస్తూ కెరీర్‌లో విజయవంతంగా ముందుకు సాగుతున్న అందాల తార సంయుక్త మీనన్. ఈ ఏడాది సంక్రాంతికి శర్వానంద్‌తో కలిసి ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో పలుకరించిన ఈ భామ ప్రస్తుతం చేతిలో నాలుగైదు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ముఖ్యంగా సంయుక్త ప్రధాన పాత్ర లో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ ‘ది బ్లాక్ గోల్డ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ షూటింగ్ మంథనిలో ఇటీవలే ముగిసింది.
బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఫిల్మ్ సంయుక్త కెరీర్‌లో ఓ మైలురాయి చిత్రంగా గుర్తుండిపోతుందని టీమ్ భావిస్తోంది. ఇంకా ‘స్వయంభు’, ‘మహారాగ్ని’ వంటి క్రేజీ ప్రాజెక్టుల్లోనూ నటిస్తోంది. ఇదిలావుండగా, సంయుక్త మరో క్రేజీ ఆఫర్‌ను అందుకున్నట్టు సమాచారం. రామ్ పోతినేని హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూ పొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతానికి ‘రాపో23’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్ పాత్రకు ఎంపికైందని టాక్. ఈ పాత్ర కోసం టీమ్ ఇంతకుముందు నివేదా పేతురాజ్‌ను సంప్రదించిందని, ఆమె డేట్స్ సర్దుబాటు కాకపోవ డంతో మేకర్స్ సంయుక్తను ఫైనల్ చేశారని తెలుస్తోంది.






